Banner


    బిరుదు బంటితఁడు పెద్ద హనుమంతుఁడు
    సంపుటి: 4, సంఖ్య: 486, పుట: 327 (339)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప:బిరుదు బంటితఁడు పెద్ద హనుమంతుఁడు
    సిరులతో రామునికి సీతాదేవికిని

    చ: మూఁడులోకములుఁ దుదముట్టఁ బెరిగినవాఁడు
    వాఁడె హనుమంతదేవరఁ జూడరో
    పోఁడిమి దైత్యులగెల్చి పూచి చేయెత్తుకున్నాఁడు
    వాఁడి ప్రతాపముతోడ వాయుజుఁడు

    చ: ధ్రువమండలము మోవఁ దోఁక యెత్తుకున్నవాఁడు
    సవరనై పెనుజంగ చాఁచుకున్నాఁడు
    భువిఁ గవచకుండలంబులతోఁ బుట్టినవాఁడు
    వివరించ నేకాంత వీరుఁడైనవాఁడు

    చ: పెనచి పండ్లగొల పిడికిలించుకున్నాఁడు
    ఘనుఁ డిన్నిటా స్వామికార్యపరుఁడు
    వినయపు శ్రీవేంకటవిభునికి హితవరి
    యెనసి మొక్కఁగదరో యెదుట నున్నాఁడు


    birudu bamTitaDu pedda hanumamtuDu
    sampuTi: 4, samkhya: 486, puTa: 327 (339)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa: birudu bamTitaDu pedda hanumamtuDu
    sirulatO rAmuniki sItAdEvikini

    cha: mUDulOkamulu dudamuTTa beriginavADu
    vADe hanumamtadEvara jUDarO
    pODimi daityulagelchi pUchi chEyettukunnADu
    vADi pratApamutODa vAyujuDu

    cha: dhruvamamDalamu mOva dOka yettukunnavADu
    savaranai penujamga chAchukunnADu
    bhuvi gavachakumDalambulatO buTTinavADu
    vivarimcha nEkAmta vIruDainavADu

    cha: penachi pamDlagola piDikilimchukunnADu
    ghanu DinniTA svAmikAryaparuDu
    vinayapu SrIvEmkaTavibhuniki hitavari
    yenasi mokkagadarO yeduTa nunnADu



    Artist(s): Dwaram Lakshmi



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported