Banner


    భావించి చూడరే పడఁతులాల
    సంపుటి: 23, సంఖ్య: 154, పుట: 103 (124)
    సంపుటిలో రాగం: మాళవిగౌళ
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: భావించి చూడరే పడఁతులాల
    చేవదేరి మహిమలు చెలఁగినట్టుండెను

    చ: పరమపురుషునికి పచ్చకప్పురముకాఁపు
    తిరుమేన నమరెను తెల్లనికాంతి
    ధరలోఁ బాలజలధి తచ్చేటివేళను
    మురిపెమై తుంపురులు ముంచినయట్టుండెను

    చ: తవిలి యీదేవునికి తట్టుపుణుఁగుకాఁపు
    నవమై మేన నమరె నల్లనికాంతి
    తివిరి గోవర్ధనమెత్తిననాఁడు నిండుకొని
    ధ్రువమై మేఘకాంతులు తొలఁకినట్టుండెను

    చ: శ్రీవేంకటేశునికి సింగారించిన సొమ్ములు
    భావించ మేన నమరె బంగారుకాంతి
    తావుగా నలమేల్‌మంగ తనవుర మెక్కఁగాను
    వేవేలుసంపదలెల్లా వెలసినట్టుండెను


    bhAvimchi chUDarE paDatulAla
    sampuTi: 23, samkhya: 154, puTa: 103 (124)
    sampuTilO rAgam: mALavigauLa
    rachana: tALlapAka annamAchArya


    pa: bhAvimchi chUDarE paDatulAla
    chEvadEri mahimalu chelaginaTTumDenu

    cha: paramapurushuniki pachchakappuramukApu
    tirumEna namarenu tellanikAmti
    dharalO bAlajaladhi tachchETivELanu
    muripemai tumpurulu mumchinayaTTumDenu

    cha: tavili yIdEvuniki taTTupuNugukApu
    navamai mEna namare nallanikAmti
    tiviri gOvardhanamettinanADu nimDukoni
    dhruvamai mEghakAmtulu tolakinaTTumDenu

    cha: SrIvEmkaTESuniki simgArimchina sommulu
    bhAvimcha mEna namare bamgArukAmti
    tAvugA nalamEl^mamga tanavura mekkagAnu
    vEvElusampadalellA velasinaTTumDenu



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported