Banner


    భావించి తెలుసుకొంటే
    సంపుటి: 4, సంఖ్య: 291, పుట: 195 (207)
    సంపుటిలో రాగం: భంగాళం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: భావించి తెలుసుకొంటే భాగ్యఫలము
    ఆవలీవలిఫలము లంగజజనకుఁడే

    చ: దానములలో ఫలము తపములలో ఫలము
    మోనములలో ఫలము ముకుందుఁడే
    జ్ఞానములలో ఫలము జపములలో ఫలము
    నానాఫలములును నారాయణుఁడే

    చ: వినుతులలో ఫలము వేదములలో ఫలము
    మనసులోని ఫలము మాధవుఁడే
    దినములలో ఫలము తీర్థయాత్రల ఫలము
    ఘనపుణ్యముల ఫలము కరుణాకరుఁడే

    చ: సతతయోగ ఫలము చదువులలో ఫలము
    అతిశయోన్నత ఫలము యచ్యుతుఁడే
    యతులలోని ఫలము జితకామిత ఫలము
    క్షితి మోక్షము ఫలము శ్రీవేంకటేశుఁడే


    bhAvimchi telusukomTE
    sampuTi: 4, samkhya: 291, puTa: 195 (207)
    sampuTilO rAgam: bhamgALam
    rachana: tALlapAka annamAchArya


    pa: bhAvimchi telusukomTE bhAgyaphalamu
    AvalIvaliphalamu lamgajajanakuDE

    cha: dAnamulalO phalamu tapamulalO phalamu
    mOnamulalO phalamu mukumduDE
    j~nAnamulalO phalamu japamulalO phalamu
    nAnAphalamulunu nArAyaNuDE

    cha: vinutulalO phalamu vEdamulalO phalamu
    manasulOni phalamu mAdhavuDE
    dinamulalO phalamu tIrthayAtrala phalamu
    ghanapuNyamula phalamu karuNAkaruDE

    cha: satatayOga phalamu chaduvulalO phalamu
    atiSayOnnata phalamu yachyutuDE
    yatulalOni phalamu jitakAmita phalamu
    kshiti mOkshamu phalamu SrIvEmkaTESuDE



    Artist(s): Dwaram Lakshmi



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported