Banner


    భావించరే చెలులాల పరమాత్మునీ
    సంపుటి: 3, సంఖ్య: 165, పుట: 111 (151)
    సంపుటిలో రాగం: శ్రీరాగం
    రచన: తాళ్లపాక అన్నమఆచార్య


    ప: భావించరే చెలులాల పరమాత్ముని
    చేవదేరి చిగురులో చెఁగయై యుండెను

    చ: మలసి పన్నీట హరి మజ్జనమాడేవేళ
    కలశాబ్ధిఁదేలేమాణికమువలె నుండెను
    అలరి కప్పురకాపు అవధరించేటివేళ
    మొలచినవెన్నెల మొలకయై యుండెను

    చ: అంచలఁ దట్టుపుణుఁగు అవధరించేటివేళ
    యెంచ నంజనాద్రిపై యేనుగై వుండెను
    మించినహారములెల్ల మేన నించుకొన్నవేళ
    మంచి మంచి నక్షత్రమండలమై యుండెను

    చ: వున్నతి నలమేల్మంగ నురముననుంచువేళ
    పెన్నిధై పూచినట్టి సంపెంగవలె నుండెను
    విన్నె శ్రీవేంకటేశుఁడు వరములిచ్చేటివేళ
    తిన్ననై యందరిభాగ్యదేవతై యుండెను


    BAviMcarE celulAla paramAtmunI
    sampuTi: 3, samkhya: 165, puTa: 111 (151)
    sampuTilO rAgam: SrIrAgam
    rachana: tALlapAka annamaAchArya


    pa: bhAvimcharE chelulAla paramAtmuni
    chEvadEri chigurulO chegayai yumDenu

    cha: malasi pannITa hari majjanamADEvELa
    kalaSAbdhidElEmANikamuvale numDenu
    alari kappurakApu avadharimchETivELa
    molachinavennela molakayai yumDenu

    cha: amchala daTTupuNugu avadharimchETivELa
    yemcha namjanAdripai yEnugai vumDenu
    mimchinahAramulella mEna nimchukonnavELa
    mamchi mamchi nakshatramamDalamai yumDenu

    cha: vunnati nalamElmamga nuramunanumchuvELa
    pennidhai pUchinaTTi sampemgavale numDenu
    vinne SrIvEmkaTESuDu varamulichchETivELa
    tinnanai yamdaribhAgyadEvatai yumDenu



    Artist(s): Vijay Yesudas , Vishnu Priya



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported