Banner


    ఆదినారాయణ నాకు నభయ
    సంపుటి: 15, సంఖ్య: 447, పుట: 301 (356)
    సంపుటిలో రాగం: సాళంగనాట
    రచన: తాళ్లపాక పెద్ద తిరుమలాచార్య


    ప: ఆదినారాయణ నాకు నభయ మీవె
    కాదని తప్పు లెంచక కరుణానిధీ

    చ: తుదకెక్క నింద్రియపు దొంగలకుఁ దాపిచ్చితి
    యెదుటికి రాఁగా నీ వే మందువో
    మదించి నాలో నుండఁగా మఱచితి నే నిన్ను
    యిదె కాను కియ్యఁగా నీ వేమందువో

    చ: పక్కన నీ యాజ్ఞ దోసి పాపము లెల్లాఁ జేసితి
    యిక్కడ నే మొక్కఁగా నీ వేమందువో
    దిక్కు నీ వుండఁగాఁ బరదేవతలఁ గొలిచితి
    నెక్కొని రక్షించు మంటే నీ విఁక నేమందువో

    చ: తొట్టి కామక్రోధాలతో దూరు లెల్లాఁ గట్టుకొంటి
    యిట్టె ముద్ర మోచే నంటే నేమందువో
    నెట్టన శ్రీవేంకటేశ నీకు నలమేల్మంగకు
    గట్టిగా నే లెంక నైతి కరుణిం చేమందువో


    AdinArAyaNa nAku nabhaya
    sampuTi: 15, samkhya: 447, puTa: 301 (356)
    sampuTilO rAgam: sALamganATa
    rachana: tALlapAka pedda tirumalAchArya


    pa: AdinArAyaNa nAku nabhaya mIve
    kAdani tappu lemchaka karuNAnidhI

    cha: tudakekka nimdriyapu domgalaku dApichchiti
    yeduTiki rAgA nI vE mamduvO
    madimchi nAlO numDagA ma~rachiti nE ninnu
    yide kAnu kiyyagA nI vEmamduvO

    cha: pakkana nI yAj~na dOsi pApamu lellA jEsiti
    yikkaDa nE mokkagA nI vEmamduvO
    dikku nI vumDagA baradEvatala golichiti
    nekkoni rakShimchu mamTE nI vika nEmamduvO

    cha: toTTi kAmakrOdhAlatO dUru lellA gaTTukomTi
    yiTTe mudra mOchE namTE nEmamduvO
    neTTana SrIvEmkaTESa nIku nalamElmamgaku
    gaTTigA nE lemka naiti karuNim chEmamduvO



    Artist(s): N Chinna Satyanarayana , B M Vasanta Subba Lakshmi



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported