Banner


    భవరోగవైద్యుఁడైన బలువెజ్జు
    సంపుటి: 10, సంఖ్య: 22, పుట: 13 (57)
    సంపుటిలో రాగం: రామక్రియ
    రచన: తాళ్లపాక చిన్న తిరుమలాచార్య


    ప: భవరోగవైద్యుఁడైన బలువెజ్జు
    సవరని పైఁడిపక్షిసకినగాఁడు

    చ: తల్లివద్ద నోరిలోన తగ లోకముములు చూపి
    వెల్లవిరి నింద్రజాలవిద్యవాఁడు
    చెల్లుబడి నొక్కకొండ చేతఁబట్టి యెత్తినాఁడు
    బల్లిదుఁడు వాఁడివో బారివిద్యవాఁడు

    చ: మునుపె సకలభూతములకు నేలికయై
    మనసెల్లా నెరిగిన మంత్రవాది
    చనవున జలధిలో సంప దింద్రునికిఁ జూపె
    అనువరి వాఁడిలో అంజనగాఁడు

    చ: పట్టరాని కాళింగుపడిగెలమీఁదు మెట్టి
    పట్టినాఁడు వాఁడువో పాములవాఁడు
    అట్టె శ్రీవెంకటనాథుఁ డమరుల నెల్లనుఁ జే
    పట్టి దైత్యులఁ జంపించే పాళగాఁడు


    bhavarOgavaidyuDaina baluvejju
    sampuTi: 10, samkhya: 22, puTa: 13 (57)
    sampuTilO rAgam: rAmakriya
    rachana: tALlapAka chinna tirumalAchArya


    pa: bhavarOgavaidyuDaina baluvejju
    savarani paiDipakshisakinagADu

    cha: tallivadda nOrilOna taga lOkamumulu chUpi
    vellaviri nimdrajAlavidyavADu
    chellubaDi nokkakomDa chEtabaTTi yettinADu
    balliduDu vADivO bArividyavADu

    cha: munupe sakalabhUtamulaku nElikayai
    manasellA nerigina mamtravAdi
    chanavuna jaladhilO sampa dimdruniki jUpe
    anuvari vADilO amjanagADu

    cha: paTTarAni kALimgupaDigelamIdu meTTi
    paTTinADu vADuvO pAmulavADu
    aTTe SrIvemkaTanAthu Damarula nellanu jE
    paTTi daityula jampimchE pALagADu



    Artist(s): D V Mohana Krishna



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported