Banner


    భావములోనా బాహ్యమునందును
    సంపుటి: 3, సంఖ్య: 561, పుట: 377 (417)
    సంపుటిలో రాగం: దేసాక్షి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: భావములోనా బాహ్యమునందును
    గోవింద గోవింద యని కొలువవో మనసా

    చ: హరియవతారములే యఖిలదేవతలు
    హరిలోనివే బ్రహ్మాండంబులు
    హరినామములే అన్నిమంత్రములు
    హరి హరి హరి యనవోమనసా

    చ: విష్ణునిమహిమలే విహితకర్మములు
    విష్ణునిఁ బొగడీ వేదములు
    విష్ణుఁ డొక్కఁడే విశ్వాంతరాత్ముఁడు
    విష్ణు విష్ణువని వెదకవోమనసా

    చ: అచ్యుతుఁ డితఁడే ఆదియు నంత్యము
    అచ్యుతుఁడే యసురాంతకుఁడు
    అచ్యుతుఁడు శ్రీవేంకటాద్రిమీఁద నిదె
    అచ్యుత యచ్యుత శరణనవోమనసా


    bhAvamulOnA bAhyamunamdunu
    sampuTi: 3, samkhya: 561, puTa: 377 (417)
    sampuTilO rAgam: dEsAkshi
    rachana: tALlapAka annamAchArya


    pa: bhAvamulOnA bAhyamunamdunu
    gOvimda gOvimda yani koluvavO manasA

    cha: hariyavatAramulE yakhiladEvatalu
    harilOnivE brahmAmDambulu
    harinAmamulE annimamtramulu
    hari hari hari yanavOmanasA

    cha: vishNunimahimalE vihitakarmamulu
    vishNuni bogaDI vEdamulu
    vishNu DokkaDE viSvAmtarAtmuDu
    vishNu vishNuvani vedakavOmanasA

    cha: achyutu DitaDE Adiyu namtyamu
    achyutuDE yasurAmtakuDu
    achyutuDu SrIvEmkaTAdrimIda nide
    achyuta yachyuta SaraNanavOmanasA



    Artist(s): M S Subbu Lakshmi



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported