Banner


    భావ మెఱిఁగిన నల్లఁబల్లి
    సంపుటి: 13, సంఖ్య: 329, పుట: 197 (218)
    సంపుటిలో రాగం: దేవగాంధారి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: భావ మెఱిఁగిన నల్లఁబల్లి చెన్నుఁడా
    నావద్దనే వుండుమీ నల్లఁబల్లి చెన్నుఁడా

    చ: వేసరక నీవు నాతో వేమారుఁ జేసినట్టి
    బాసలు నమ్మితి నల్లఁబల్లి చెన్నుఁడా
    వాసికి వన్నెకు నీకు వలచి చొక్కితి నేను
    నా సూటికే మన్నించు నల్లఁబల్లి చెన్నుఁడా

    చ: క్రియ గూడ నేను నీ కేలువట్టి పెండ్లాడితి
    బయలీఁదించకు నల్లఁబల్లి చెన్నుఁడా
    ప్రియములు రెట్టింపఁ బెనఁగితి నిందాఁకా
    నయములు చూపుమీ నల్లఁబల్లి చెన్నుఁడా

    చ: యెనసితి విటు నన్ను నియ్యకోలు సేసుకొని
    పనుపడె రతి నల్లఁబల్లి చెన్నుఁడా
    ఘనశ్రీవేంకటాద్రిపై కందువ నేలుకొంటివి
    నను నిందరిలోపల నల్లఁబల్లి చెన్నుఁడా


    bhAva me~rigina nallaballi
    sampuTi: 13, samkhya: 329, puTa: 197 (218)
    sampuTilO rAgam: dEvagAmdhAri
    rachana: tALlapAka annamAchArya


    pa: bhAva me~rigina nallaballi chennuDA
    nAvaddanE vumDumI nallaballi chennuDA

    cha: vEsaraka nIvu nAtO vEmAru jEsinaTTi
    bAsalu nammiti nallaballi chennuDA
    vAsiki vanneku nIku valachi chokkiti nEnu
    nA sUTikE mannimchu nallaballi chennuDA

    cha: kriya gUDa nEnu nI kEluvaTTi pemDlADiti
    bayalIdimchaku nallaballi chennuDA
    priyamulu reTTimpa benagiti nimdAkA
    nayamulu chUpumI nallaballi chennuDA

    cha: yenasiti viTu nannu niyyakOlu sEsukoni
    panupaDe rati nallaballi chennuDA
    ghanaSrIvEmkaTAdripai kamduva nElukomTivi
    nanu nimdarilOpala nallaballi chennuDA



    Artist(s): N/A



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported