Banner


    భారము నీపై వేసి బ్రదికియుండుటే
    సంపుటి: 15, సంఖ్య: 25, పుట: 17 (72)
    సంపుటిలో రాగం: భూపాళం
    రచన: తాళ్లపాక పెద్ద తిరుమలాచార్య


    ప: భారము నీపై వేసి బ్రదికియుండుటే మేలు
    నారాయణుఁడ నీవే నాకుఁ గలవనుచూ

    చ: శరణన వెరపయ్యీ సామజముఁ గాచినట్టు
    వరుస దావతిపడి వచ్చేవంటా
    హరి కృష్ణ యన వెరపయ్యీ ద్రౌపదివర
    మిరవుగ నిచ్చినట్టు యిచ్చేవో యనుచు

    చ: చేత మొక్క వెరపయ్యీ చీర లిచ్చి యింతులకు
    బాఁతిపడ్డట్టే నన్నుఁ బైకొనే వంటా
    ఆతల నమ్మఁగ వెరపయ్యీఁ బాండవులవలెఁ
    గాతరాన వెంట వెంటఁ గాచియుండే వనుచు

    చ: ఆరగించుమన వెరపయ్యీ శబరివలె
    ఆరయ నెంగిలి యన కంటే వంటా
    యేరీతి నన వెఱతు యిచ్చైనట్ట్లఁ గావు
    కూరిమి శ్రీ వేంకటేశ గోవులఁ గాచినట్లు


    bhAramu nIpai vEsi bradikiyumDuTE
    sampuTi: 15, samkhya: 25, puTa: 17 (72)
    sampuTilO rAgam: bhUpALam
    rachana: tALlapAka pedda tirumalAchArya


    pa: bhAramu nIpai vEsi bradikiyumDuTE mElu
    nArAyaNuDa nIvE nAku galavanuchU

    cha: SaraNana verapayyI sAmajamu gAchinaTTu
    varusa dAvatipaDi vachchEvamTA
    hari kRshNa yana verapayyI draupadivara
    miravuga nichchinaTTu yichchEvO yanuchu

    cha: chEta mokka verapayyI chIra lichchi yimtulaku
    bAtipaDDaTTE nannu baikonE vamTA
    Atala nammaga verapayyI bAmDavulavale
    gAtarAna vemTa vemTa gAchiyumDE vanuchu

    cha: Aragimchumana verapayyI Sabarivale
    Araya nemgili yana kamTE vamTA
    yErIti nana ve~ratu yichchainaTTla gAvu
    kUrimi SrI vEmkaTESa gOvula gAchinaTlu



    Artist(s): Dwaram Thyagaraju



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported