Banner


    భారమైనవేఁపమాను పాలువోసి
    సంపుటి: 1, సంఖ్య: 287, పుట: 192 (258)
    సంపుటిలో రాగం: దేవగాంధారి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: భారమైనవేఁపమాను పాలువోసి పెంచినాను
    తీరనిచేఁదేకాక తియ్యనుండీనా

    చ: పాయఁదీసి కుక్కతోఁక బద్దలువెట్టి బిగిసి
    చాయ కెంతగట్టినాను చక్కనుండీనా
    కాయపువికార మిది కలకాలముఁ జెప్పినా
    పోయినపోకలేకాక బుద్ధి వినీనా

    చ: ముంచిముంచి నీటిలోన మూల నానఁబెట్టుకొన్నా
    మించినగొడ్డలి నేఁడు మెత్తనయ్యీనా
    పంచమహాపాతకాలబారిఁబడ్డచిత్త మిది
    దంచిదంచిచెప్పినాను తాఁకి వంగీనా

    చ: కూరిమితోఁ దేలుఁ దెచ్చి కోకలోనబెట్టుకొన్నా
    సారెసారెఁ గుట్టుగాక చక్కనుండీనా
    వేరులేనిమహిమలవేంకటవిభునికృప
    ఘోరమైనఆస మేలుకోరసోఁకీనా


    bhAramainavEpamAnu pAluvOsi
    sampuTi: 1, samkhya: 287, puTa: 192 (258)
    sampuTilO rAgam: dEvagAmdhAri
    rachana: tALlapAka annamAchArya


    pa: bhAramainavEpamAnu pAluvOsi pemchinAnu
    tIranichEdEkAka tiyyanumDInA

    cha: pAyadIsi kukkatOka baddaluveTTi bigisi
    chAya kemtagaTTinAnu chakkanumDInA
    kAyapuvikAra midi kalakAlamu jeppinA
    pOyinapOkalEkAka buddhi vinInA

    cha: mumchimumchi nITilOna mUla nAnabeTTukonnA
    mimchinagoDDali nEDu mettanayyInA
    pamchamahApAtakAlabAribaDDachitta midi
    damchidamchicheppinAnu tAki vamgInA

    cha: kUrimitO dElu dechchi kOkalOnabeTTukonnA
    sAresAre guTTugAka chakkanumDInA
    vErulEnimahimalavEmkaTavibhunikRpa
    ghOramainaAsa mElukOrasOkInA



    Artist(s): P Ranganath



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported