Banner


    బాపు బాపు కృష్ణా బాలకృష్ణా
    సంపుటి: 26, సంఖ్య: 152, పుట: 107 (163)
    సంపుటిలో రాగం: బౌళి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: బాపు బాపు కృష్ణా బాలకృష్ణా
    బాపురే నీ ప్రతాప భాగ్యము లివివో

    చ: బాలుఁడవై రేపల్లెఁ బాలు నీ వారగించఁగ
    పాల జలనిధి యెంత భయపడెనో
    ఆలించి తొదలుమాట లాడనేరుచుకొనఁగ
    యీలీలన సురసతు లెంత భ్రమసిరో

    చ: తప్పటడుగులు నీవు ధరమీఁదఁ బెట్టఁగాను
    తప్పక బలీంద్రుఁ డేమి దలఁచినాఁడో
    అప్పుడే దాఁగిలిముచ్చు లందరితో నాడఁగాను
    చెప్పేటివేదాలు నిన్నుఁ జేరి యెంత నగునో

    చ: సందడి గోపికల చంకలెక్కి వున్ననాఁడు
    చెంది నీ వురము మీఁది శ్రీసతి యేమనెనో
    విందుగ శ్రీవేంకటాద్రి విభుఁడవై యున్న నేఁడు
    కందువైనదేవతలఘనత యెట్టుండునో


    bApu bApu kRshNA bAlakRshNA
    sampuTi: 26, samkhya: 152, puTa: 107 (163)
    sampuTilO rAgam: bauLi
    rachana: tALlapAka annamAchArya


    pa: bApu bApu kRshNA bAlakRshNA
    bApurE nI pratApa bhAgyamu livivO

    cha: bAluDavai rEpalle bAlu nI vAragimchaga
    pAla jalanidhi yemta bhayapaDenO
    Alimchi todalumATa lADanEruchukonaga
    yIlIlana surasatu lemta bhramasirO

    cha: tappaTaDugulu nIvu dharamIda beTTagAnu
    tappaka balImdru DEmi dalachinADO
    appuDE dAgilimuchchu lamdaritO nADagAnu
    cheppETivEdAlu ninnu jEri yemta nagunO

    cha: samdaDi gOpikala chamkalekki vunnanADu
    chemdi nI vuramu mIdi SrIsati yEmanenO
    vimduga SrIvEmkaTAdri vibhuDavai yunna nEDu
    kamduvainadEvatalaghanata yeTTumDunO



    Artist(s): T P Chakrapani



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported