Banner


    అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతు
    సంపుటి: 2, సంఖ్య: 79, పుట: 53 (125)
    సంపుటిలో రాగం: సాళంగనాట
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతుసేనాపతి
    పదిదిక్కులకు నిట్టె పారరో యసురులు

    చ: గరుడధ్వజం బదె ఘనశంఖరవ మదె
    సరుసనే విష్ణుదేవుచక్ర మదె
    మురవైరిపంపు లవె ముందరిసేన లవె
    పరచి గగ్గుల కాడై (కాఱై ?) పారరో దానవులు

    చ: తెల్లని గొడుగు లవె దేవదుందుభులు నవె
    యెల్లదేవతలరథా లింతటా నవె
    కెల్లురేఁగీ నిక్కి హరికీర్తి భుజము లవె
    పల్లపుపాతాళానఁ బడరో దనుజులు

    చ: వెండిపైఁడిగుదె లవె వెంజామరము లవె
    మెండగుకైవారాలు మించిన నవె
    దండి శ్రీవేంకటపతి దాడిముట్టె నదె యిదె
    బఁడుబండై జజ్జరించి పారరోదైతేయులు


    ade vacche nide vacche nachyutu
    sampuTi: 2, samkhya: 79, puTa: 53 (125)
    sampuTilO rAgam: sALamganATa
    rachana: tALlapAka annamAchArya


    pa: ade vacche nide vacche nachyutusEnApati
    padidikkulaku niTTe pArarO yasurulu

    cha: garuDadhwajam bade ghanaSamkharava made
    sarusanE viShNudEvuchakra made
    muravairipampu lave mumdarisEna lave
    parachi gaggula kADai (kA~rai ?) pArarO dAnavulu

    cha: tellani goDugu lave dEvadumdubhulu nave
    yelladEvatalarathA limtaTA nave
    kellurEgI nikki harikIrti bhujamu lave
    pallapupAtALAna baDarO danujulu

    cha: vemDipaiDigude lave vemjAmaramu lave
    memDagukaivArAlu mimchina nave
    damDi SrIvEmkaTapati dADimuTTe nade yide
    baDubamDai jajjarimchi pArarOdaitEyulu



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported