Banner


    అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము
    సంపుటి: 1, సంఖ్య: 179, పుట: 120 (186)
    సంపుటిలో రాగం: సామంతం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప : అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము
    ముయ్యంచుమనసున నే మోహమతి నైతి

    చ : చుట్టంబులా తనకు సుతులుఁగాంతలుఁ జెలులు
    వట్టియాసలఁ బెట్టువారేకాక
    నెట్టుకొని వీరు గడునిజమనుచు హరి నాత్మఁ
    బెట్టనేరక వృథా పిరివీకులైతి

    చ : తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును
    వగలఁ బెట్టుచుఁ దిరుగువారేకాక
    మిగుల వీరలపొందు మేలనుచు హరి నాత్మఁ
    దగిలించలేక చింతాపరుఁడనైతి

    చ : అంతహితులా తనకు నన్నలునుఁ దమ్ములును
    వంతువాసికిఁ బెనఁగువారేకాక
    అంతరాత్ముఁడు శ్రీవేంకటాద్రీశుఁ గొలువ కిటు
    సంతకూటములయలజడికి లోనైతి


    ayyO pOya brAyamu gAlamu
    sampuTi: 1, samkhya: 179, puTa: 120 (186)
    sampuTilO rAgam: sAmamtam
    rachana: tALlapAka annamAchArya


    pa : ayyO pOya brAyamu gAlamu
    muyyamchumanasuna nE mOhamati naiti

    cha : chuTTambulA tanaku sutulugAMtalu jelulu
    vaTTiyAsala beTTuvArEkAka
    neTTukoni vIru gaDunijamanuchu hari nAtma
    beTTanEraka vRthA pirivIkulaiti

    cha : tagubamdhulA tanaku dallulunu damDrulunu
    vagala beTTuchu diruguvArEkAka
    migula vIralapomdu mElanuchu hari nAtma
    dagilimchalEka chimtAparuDanaiti

    cha : amtahitulA tanaku nannalunu dammulunu
    vamtuvAsiki benaguvArEkAka
    amtarAtmuDu SrIvEMkaTAdrISu goluva kiTu
    samtakUTamulayalajaDiki lOnaiti



    Artist(s): Shobha Raju



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported