Banner


    అవధారు దేవ హరికులరామ
    సంపుటి: 3, సంఖ్య: 144, పుట: 97 (137)
    సంపుటిలో రాగం: సాళంగనాట
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అవధారు దేవ హరికులరామ
    వివిధమై నీబంటు వెలయుచున్నాఁడు

    చ: అదె కలశాపురము హనుమంత రాయఁడు
    కదనములోన రక్కసులఁ గొట్టి
    యెదుట నిందరిలోన నేకాంగవీరుఁడై
    కొదలేక ప్రతాపించి కొలువై వున్నాఁడు

    చ: చల్లని వనాలనీడ సాగుడుఁ గొండలోన
    వల్లెగా వేసుకొన్న వాలముతోడ
    పల్లదాన వలకేలు పంతమున నెత్తుకొని
    కొల్లున మంటపములోఁ గొలువై వున్నాఁడు

    చ: పెక్కు పండ్లగొలలు పిడికిటఁ బట్టుకొని
    చక్కఁగాఁ బెరిగి పెద్దజంగ చాఁచి
    యిక్కువ శ్రీవేంకటాద్రి నిరవైన సర్వేశ
    గుక్కక నీపై భక్తిఁ గొలువై వున్నాఁడు


    avadhAru dEva harikularAma
    sampuTi: 3, samkhya: 144, puTa: 97 (137)
    sampuTilO rAgam: sALamganATa
    rachana: tALlapAka annamAchArya


    pa: avadhAru dEva harikularAma
    Vividhamai nIbamTu velayuchunnADu

    cha: ade kalaSApuramu hanumamta rAyaDu
    kadanamulOna rakkasula goTTi
    yeduTa nimdarilOna nEkAmgavIruDai
    kodalEka pratApimchi koluvai vunnADu

    cha: challani vanAlanIDa sAguDu gomDalOna
    vallegA vEsukonna vAlamutODa
    palladAna valakElu pamtamuna nettukoni
    kolluna mamTapamulO goluvai vunnADu

    cha: pekku pamDlagolalu piDikiTa baTTukoni
    chakkagA berigi peddajamga chAchi
    yikkuva SrIvEmkaTAdri niravaina sarvESa
    gukkaka nIpai bhakti goluvai vunnADu



    Artist(s): G Nageswara Naidu



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported