Banner


    అవధారు రఘుపతి యందరినిఁ
    సంపుటి: 3, సంఖ్య: 492, పుట: 331 (371)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అవధారు రఘుపతి యందరినిఁ జిత్తగించు
    యివల నిండెఁ గొలువిదె నడె సముఖా

    చ: రామ రాఘవ రామభద్ర రామచంద్ర
    శ్రీమదయోధ్యాపతి సీతాపతి
    ప్రేమ నారదుఁడు వాఁడీఁ బెక్కు రంభాదు లాడేరు
    మోమెత్తి కపులెల్లా మొక్కేరదివో

    చ: యినవంశకులజాత ఇక్ష్వాకుతిలకా
    ఘనదశరథసుత కౌశికప్రియ
    మునులు దీవించేరు ముందట భరతుఁ డదె
    వెనక లక్ష్మణుఁడు సేవించీ వింజామర

    చ: కందువఁ గౌసల్యాగర్భరత్నాకర
    చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాసా
    సందడిఁ గుశలవులు చదివేరు వొకవంక
    చెంది నీ రాజసము చెప్పరాదు రామా


    avadhAru raghupati yamdarini
    sampuTi: 3, samkhya: 492, puTa: 331 (371)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa: avadhAru raghupati yamdarini jittagimchu
    Yivala nimDe goluvide naDe samukhA

    cha: rAma rAghava rAmabhadra rAmachamdra
    SrImadayOdhyApati sItApati
    prEma nAraduDu vADI bekku rambhAdu lADEru
    mOmetti kapulellA mokkEradivO

    cha: yinavamSakulajAta ikshvAkutilakA
    ghanadaSarathasuta kauSikapriya
    munulu dIvimchEru mumdaTa bharatu Dade
    venaka lakshmaNuDu sEvimchI vimjAmara

    cha: kamduva gausalyAgarbharatnAkara
    chemdina SrIvEmkaTAdri SrInivAsA
    samdaDi guSalavulu chadivEru vokavamka
    chemdi nI rAjasamu chepparAdu rAmA



    Artist(s): Malladi Brothers



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported