Banner


    అవధారు చిత్తగించు హనుమంతుడు
    సంపుటి: 4, సంఖ్య: 490, పుట: 330 (342)
    సంపుటిలో రాగం: మాళవిగౌళ
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అవధారు చిత్తగించు హనుమంతుఁడు వీఁడె
    భువిలోన గలశాపుర హనుమంతుఁడు

    చ: రామ నీ సేవకుఁ డిదె రణరంగ ధీరుఁడు
    ఆముకొన్న సత్వగల హనుమంతుఁడు
    దీమసాన లంక సాధించి వుంగరము దెచ్చె
    కామిత ఫలదుఁడు యీ ఘన హనుమంతుఁడు

    చ: జానకీరమణ సప్తజలధులు లంఘించి
    ఆనుక సంజీవి దెచ్చె హనుమంతుఁడు
    పూని చుక్కలెల్లా మొలపూసలుఁగాఁగఁబెరిగి
    భాను కోటి కాంతితోఁ జొప్పడు హనుమంతుఁడు

    చ: యినవంశ శ్రీ వేంకటేశ నీ కరుణతోడ
    అనుపమ జయశాలి హనుమంతుఁడు
    పనిపూని ఇటమీఁది బ్రహ్మపట్టమునకు నీ -
    యనుమతిఁ గాచుకున్నా డదె హనుమంతుఁడు


    avadhAru chittagimchu hanumamtuDu
    sampuTi: 4, samkhya: 490, puTa: 330 (342)
    sampuTilO rAgam: mALavigauLa
    rachana: tALlapAka annamAchArya


    pa: avadhAru chittagimchu hanumamtuDu vIDe
    bhuvilOna galaSApura hanumamtuDu

    cha: rAma nI sEvaku Dide raNaramga dhIruDu
    Amukonna satvagala hanumamtuDu
    dImasAna lamka sAdhimchi vumgaramu dechche
    kAmita phaladuDu yI ghana hanumamtuDu

    cha: jAnakIramaNa saptajaladhulu lamghimchi
    Anuka samjIvi dechche hanumamtuDu
    pUni chukkalellA molapUsalugAgaberigi
    bhAnu kOTi kAmtitO joppaDu hanumamtuDu

    cha: yinavamSa SrI vEmkaTESa nI karuNatODa
    anupama jayaSAli hanumamtuDu
    panipUni iTamIdi brahmapaTTamunaku nI –
    yanumati gAchukunnA Dade hanumamtuDu



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported