Banner


    అవధరించవయ్యా అట్టె కలకాలము
    సంపుటి: 22, సంఖ్య: 502, పుట: 335 (353)
    సంపుటిలో రాగం: సాళంగనాట
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అవధరించవయ్యా అట్టె కలకాలము
    తవిలి సేవలు సేసీఁ దరుణి నీకు

    చ: నెలఁతచెమటలే పన్నీటి మజ్జనము నీకు
    తళుకుఁబయ్యదకొంగు తడియొత్తు
    కలికినవ్వులే కప్పురకాపు నీకు
    పొలుపొందఁ జూపులే పుణుఁగుకావు

    చ: మగువయంగరాగమే మంచిచంద్రగావిదట్టి
    తగుఁగాఁగిటిచేతులే తమ్మిపూజలు
    చిగురుఁబెదవులే శ్రీతులసీదళములు
    మొగి రతిచెనకులే మునుకొన్నసొమ్ములు

    చ: అలమేలుమంగ తానే యక్కుననుండేదేవులు
    పలుకులే వేదమంత్రపాటలు
    యెలమి శ్రీవేంకటేశ యెంచి చూచితే నీకు
    జలజాక్షిసరసాలు సకలసంపదలు


    avadharimchavayyA aTTe kalakAlamu
    sampuTi: 22, samkhya: 502, puTa: 335 (353)
    sampuTilO rAgam: sALamganATa
    rachana: tALlapAka annamAchArya


    pa: avadharimchavayyA aTTe kalakAlamu
    tavili sEvalu sEsI daruNi nIku

    cha: nelatachemaTalE pannITi majjanamu nIku
    taLukubayyadakomgu taDiyottu
    kalikinavvulE kappurakApu nIku
    polupomda jUpulE puNugukAvu

    cha: maguvayamgarAgamE mamchichamdragAvidaTTi
    tagugAgiTichEtulE tammipUjalu
    chigurubedavulE SrItulasIdaLamulu
    mogi ratichenakulE munukonnasommulu

    cha: alamElumamga tAnE yakkunanumDEdEvulu
    palukulE vEdamamtrapATalu
    yelami SrIvEmkaTESa yemchi chUchitE nIku
    jalajAkshisarasAlu sakalasampadalu



    Artist(s): Y V S Padmavati



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported