Banner


    ఆవధరించఁగదయ్య అన్నిరసములు
    సంపుటి: 7, సంఖ్య: 423, పుట: 260 (270)
    సంపుటిలో రాగం: శంకరాభరణం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆవధరించఁగదయ్య అన్నిరసములు నీవు
    తివురుచు నబ్బెనిదె తేనె మోవిరసము

    చ: చెలియచక్కఁదనాన శృంగారరసము
    వెలయ బొమజంకెనల వీరరసము
    కలయు రతికాంక్షలను కరుణారసము
    అలరు మైపులకలను అద్భుతరసంబు

    చ: తరుణిసరసములను తగుహాస్యరసము
    పరుషంపువిరహాన భయరసంబు
    బెరయు నిబ్బరములను బీభత్సరసము
    గరిమ మరుయుద్ధాన ఘనరౌద్రరసము

    చ: వనిత ఆనందముల వడిశాంతరసము
    ననుపుమంతనములను నవరసములు
    యెనలేని శ్రీ వేంకటేశ నీతోఁ గూడి
    దిన దిన వినోదాల తిరమాయ రసము


    Avadharimchagadayya annirasamulu
    sampuTi: 7, samkhya: 423, puTa: 260 (270)
    sampuTilO rAgam: SamkarAbharaNam
    rachana: tALlapAka annamAchArya


    pa: Avadharimchagadayya annirasamulu nIvu
    tivuruchu nabbenide tEne mOvirasamu

    cha: cheliyachakkadanAna SRmgArarasamu
    velaya bomajamkenala vIrarasamu
    kalayu ratikAmkshalanu karuNArasamu
    alaru maipulakalanu adbhutarasambu

    cha: taruNisarasamulanu taguhAsyarasamu
    parushampuvirahAna bhayarasambu
    berayu nibbaramulanu bIbhatsarasamu
    garima maruyuddhAna ghanaraudrarasamu

    cha: vanita Anamdamula vaDiSAmtarasamu
    nanupumamtanamulanu navarasamulu
    yenalEni SrI vEmkaTESa nItO gUDi
    dina dina vinOdAla tiramAya rasamu



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported