Banner


    ఔనయ్యా మేలెరిఁగిన ఆణికాఁడవు
    సంపుటి: 10, సంఖ్య: 98, పుట: 56 (138)
    సంపుటిలో రాగం: సాళంగనాట
    రచన: తాళ్లపాక చినతిరుమలాచార్య


    ప: ఔనయ్యా మేలెరిఁగిన ఆణికాఁడవు
    తానకమైన నీ దొరతనమెల్లాఁ గంటిమి

    చ: జక్కఁదన మెరఁగనిజాణవా నీ వేమైనా
    తక్కరి వై గుజ్జుదానిఁ దగిలితివి
    యెక్కువగా నాముందర యెవ్వరినో యెంచఁగాను
    చక్కఁగా నామదిలోన చల్లఁ గాక వుండునా

    చ: కన్నెపాయ మెరఁగని ఘనుఁడవా నీ వేమి
    పిన్న వై రేవతిదేవిఁ బెండ్లాడితివి
    యెన్నికె నాముందర నీయింతులజవ్వనమెంచె
    తన్నిటా నామదిలోన నానందించ కుందునా

    చ: యిట్టె వినయము నీ వెరఁగవా నీ రొమ్ము
    మెట్టినయింతికె కడు మేలువాఁడవు
    చిట్టకము లెంచేటి శ్రీవెంకటనాథ నన్ను
    గటిగాఁ గూడితివి నేఁ గరఁగక వుందునా


    aunayyA mElerigina ANikADavu
    sampuTi: 10, samkhya: 98, puTa: 56 (138)
    sampuTilO rAgam: sALamganATa
    rachana: tALlapAka chinatirumalAchArya


    pa: aunayyA mElerigina ANikADavu
    tAnakamaina nI doratanamellA gamTimi

    cha: jakkadana meraganijANavA nI vEmainA
    takkari vai gujjudAni dagilitivi
    yekkuvagA nAmumdara yevvarinO yemchagAnu
    chakkagA nAmadilOna challa gAka vumDunA

    cha: kannepAya meragani ghanuDavA nI vEmi
    pinna vai rEvatidEvi bemDlADitivi
    yennike nAmumdara nIyimtulajavvanamemche
    tanniTA nAmadilOna nAnamdimcha kumdunA

    cha: yiTTe vinayamu nI veragavA nI rommu
    meTTinayimtike kaDu mEluvADavu
    chiTTakamu lemchETi SrIvemkaTanAtha nannu
    gaTigA gUDitivi nE garagaka vumdunA



    Artist(s): Hemavati



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported