Banner


    ఔనయ్య జాణఁడవు ప్రహ్లాదవరదా
    సంపుటి: 4, సంఖ్య: 497, పుట: 335 (347)
    సంపుటిలో రాగం: సామంతం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఔనయ్య జాణఁడవు ప్రహ్లాదవరదా
    ఆసలు వెట్టకుము ప్రహ్లాదవరదా

    చ: వేసరక శ్రీసతితో వేడుక నవ్వులు నవ్వి
    ఆసలు చూపేవు ప్రహ్లాదవరదా
    సేసవెట్టిన చేతుల చెఱఁగువట్టి తీసేవు
    ఆ సుద్దులే చెప్పేను ప్రహ్లాదవరదా

    చ: నంటునఁ దొడమీఁదను నలినాక్షి నెక్కించుక
    అంటేవు సిగ్గులు ప్రహ్లాదవరదా
    గెంటక యేపొద్దును కేలుగేలుఁ గీలించుక
    అంటువాయ వదివో ప్రహ్లాదవరదా

    చ: కందువతోఁ గాఁగిలించి కైవసము సేసుకొంటి -
    నందముగ నీకెను ప్రహ్లాదవరదా
    పొంది శ్రీవేంకటమున పొంచి యౌభళములోనా
    అంది వరాలిచ్చేవు ప్రహ్లాదవరదా


    aunayya jANaDavu prahlAdavaradA
    sampuTi: 4, samkhya: 497, puTa: 335 (347)
    sampuTilO rAgam: sAmamtam
    rachana: tALlapAka annamAchArya


    pa: aunayya jANaDavu prahlAdavaradA
    Asalu veTTakumu prahlAdavaradA

    cha: vEsaraka SrIsatitO vEDuka navvulu navvi
    Asalu chUpEvu prahlAdavaradA
    sEsaveTTina chEtula che~raguvaTTi tIsEvu
    A suddulE cheppEnu prahlAdavaradA

    cha: namTuna doDamIdanu nalinAkshi nekkimchuka
    amTEvu siggulu prahlAdavaradA
    gemTaka yEpoddunu kElugElu gIlimchuka
    amTuvAya vadivO prahlAdavaradA

    cha: kamduvatO gAgilimchi kaivasamu sEsukomTi -
    namdamuga nIkenu prahlAdavaradA
    pomdi SrIvEmkaTamuna pomchi yaubhaLamulOnA
    amdi varAlichchEvu prahlAdavaradA



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported