Banner


    అటువంటివాఁడువో హరిదాసుఁడు
    సంపుటి: 1, సంఖ్య: 484, పుట: 324 (390)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అటువంటివాఁడువో హరిదాసుఁడు
    అటమటాలు విడిచినాతఁడే సుఖి

    చ: తిట్టేటిమాటలును దీవించేమాటలును
    అట్టే సరెని తలఁచి నాతఁడే సుఖి
    పట్టి చంపేవేళను పట్టము గట్టే వేళ
    అట్టు నిట్టు చలించనిల యాతడే సుఖి

    చ: చేరి పంచదారిడినఁ జేదు దెచ్చి పెట్టినాను
    అరగించి తనివొందే యతఁడే సుఖి
    తేరకాండ్లఁ జూచిన తెగరాని చుట్టముల
    నారయ సరిగాఁజూచే యాతడే సుఖి

    చ: పొంది పుణ్యము వచ్చి పొరిఁ బాపము వచ్చిన-
    నందలి ఫలమొల్లని యాతడే సుఖి
    విందుగా శ్రీవేంకటాద్రి విభునిదాసులఁ జేరి
    అందరానిపద మందననాతఁడే సుఖి


    aTuvamTivADuvO haridAsuDu
    sampuTi: 1, samkhya: 484, puTa: 324 (390)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa: aTuvamTivADuvO haridAsuDu
    aTamaTAlu viDichinAtaDE sukhi

    cha: tiTTETimATalunu dIvimchEmATalunu
    aTTE sareni talachi nAtaDE sukhi
    paTTi champEvELanu paTTamu gaTTE vELa
    aTTu niTTu chalimchanila yAtaDE sukhi

    cha: chEri pamchadAriDina jEdu dechchi peTTinAnu
    aragimchi tanivomdE yataDE sukhi
    tErakAmDla jUchina tegarAni chuTTamula
    nAraya sarigAjUchE yAtaDE sukhi

    cha: pomdi puNyamu vachchi pori bApamu vachchina-
    namdali phalamollani yAtaDE sukhi
    vimdugA SrIvEmkaTAdri vibhunidAsula jEri
    amdarAnipada mamdananAtaDE sukhi



    Artist(s): N/A



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported