Banner


    అటువలెనె సుజ్ఞాని యన్ని పుణ్యములుఁ
    సంపుటి: 15, సంఖ్య: 424, పుట: 285 (340)
    సంపుటిలో రాగం: శంకరాభరణం
    రచన: తాళ్లపాక పెదతిరుమలాచార్య


    ప: అటువలెనె సుజ్ఞాని యన్ని పుణ్యములుఁ జేసి
    తటుకున హరి కిచ్చి తా నుండవలెను

    చ: వూరి పసులను మేపి వొప్పగించి యిండ్లకు
    చేరి జంగిలివాఁడు నిశ్చింతుఁడై వుండు
    తేరకాఁడు మోసి మోచి తెచ్చి నగరి కొప్పించి
    నేరుపుతో వెట్టి వాఁడు నెమ్మది నిద్రించును

    చ: అంటి బూరెలు వండినయాపె చేతులట చూపి
    యింటివారి కొప్పగించి యేఁగినయట్టు
    నంటుతోడఁ బేరటాలు నాగవల్లియైనమీఁద
    వొంటిఁ దన నెలవున నూరకున్నయట్టు

    చ: కూటమి వచ్చినవాఁడు గుంపులెల్లా విచ్చిపోతే
    యేఁటివాఁడుఁ గాక తన యిచ్చనే వుండు
    పాటించి శ్రీవేంకటేశుబంటు యేలికెపనులు
    గాటాన నన్నిఁ జేయుఁ గర్త యేమీ గాఁడు


    aTuvalene suj~nAni yanni puNyamulu
    sampuTi: 15, samkhya: 424, puTa: 285 (340)
    sampuTilO rAgam: SamkarAbharaNam
    rachana: tALlapAka pedatirumalAchArya


    pa: aTuvalene suj~nAni yanni puNyamulu jEsi
    taTukuna hari kichchi tA numDavalenu

    cha: vUri pasulanu mEpi voppagimchi yimDlaku
    chEri jamgilivADu niSchimtuDai vumDu
    tErakADu mOsi mOchi techchi nagari koppimchi
    nEruputO veTTi vADu nemmadi nidrimchunu

    cha: amTi bUrelu vamDinayApe chEtulaTa chUpi
    yimTivAri koppagimchi yEginayaTTu
    namTutODa bEraTAlu nAgavalliyainamIda
    vomTi dana nelavuna nUrakunnayaTTu

    cha: kUTami vachchinavADu gumpulellA vichchipOtE
    yETivADu gAka tana yichchanE vumDu
    pATimchi SrIvEmkaTESubamTu yElikepanulu
    gATAna nanni jEyu garta yEmI gADu



    Artist(s): N Chinna Satyanarayana , R Ramya



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported