Banner


    అదె లంక సాధించె
    సంపుటి: 4, సంఖ్య: 514, పుట: 347 (359)
    సంపుటిలో రాగం: మాళవిగౌళ
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అదె లంక సాధించె నవనిభారము దించె
    విదితమై ప్రతాపము వెలయించె నితఁడు

    చ: రవివంశతిలకుఁడు రాముఁ డితఁడు
    భువిఁ బుట్టె దశరథ పుత్రుఁ డితఁడు
    భవుఁడెంచెఁ దారకబ్రహ్మ మీతఁడు
    పవనజుకిచ్చినాఁడు బ్రహ్మపట్ట మీతఁడు

    చ: బలువుఁడు సీతాపతి యితఁడు
    తలకొన్న వాలిమర్దనుఁ డితఁడు
    విలసిల్లె నేకాంగవీరుఁ డితఁడు
    చలమరి కోదండదీక్షాగురుఁ డితఁడు

    చ: శరణాగత వజ్రపంజరుఁ డితఁడు
    సరిలేని యసురభంజకుఁ డితఁడు
    వరదుఁడు శ్రీవేంకటేశ్వరుఁ డితఁడు
    అరయ విజయనగరాధీశుఁ డితఁడు


    ade lamka sAdhimche
    sampuTi: 4, samkhya: 514, puTa: 347 (359)
    sampuTilO rAgam: mALavigauLa
    rachana: tALlapAka annamAchArya


    pa: ade lamka sAdhimche navanibhAramu dimche
    viditamai pratApamu velayimche nitaDu

    cha: ravivamSatilakuDu rAmu DitaDu
    bhuvi buTTe daSaratha putru DitaDu
    bhavuDemche dArakabrahma mItaDu
    pavanajukicchinADu brahmapaTTa mItaDu

    cha: baluvuDu sItApati yitaDu
    talakonna vAlimardanu DitaDu
    vilasille nEkAmgavIru DitaDu
    chalamari kOdamDadIkShAguru DitaDu

    cha: SaraNAgata vajrapamjaru DitaDu
    sarilEni yasurabhamjaku DitaDu
    varaduDu SrIvEmkaTESwaru DitaDu
    araya vijayanagarAdhISu DitaDu



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported