Banner


    అతిసులభం బిదె శ్రీపతిశరణము
    సంపుటి: 2, సంఖ్య: 41, పుట: 28 (100)
    సంపుటిలో రాగం: బౌళి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అతిసులభం బిదె శ్రీపతిశరణము అందుకు నారదాదుల సాక్షి
    ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి

    చ: వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును
    ఆసపాటుగా హరి యున్నాఁడిదె అందుకుఁ బ్రహ్లాదుఁడే సాక్షి
    మోసపోకుమీ జన్మమా ముంచిన యనుమానములను
    సేసినభక్తికిఁ జేటు లేదు యీసేఁతకెల్ల ధ్రువుఁడే సాక్షి

    చ: తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి
    అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుఁడే సాక్షి
    భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీఁదీఁది
    తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుఁడే సాక్షి

    చ: మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతినుతులు
    అరయఁగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులే సాక్షి
    తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోఁగి
    సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి


    atisulabham bide SrIpatiSaraNamu
    sampuTi: 2, samkhya: 41, puTa: 28 (100)
    sampuTilO rAgam: bauLi
    rachana: tALlapAka annamAchArya


    pa: atisulabham bide SrIpatiSaraNamu amduku nAradAdula sAkshi
    pratilE didiyE nityAnamdamu bahuvEdambule yivE sAkshi

    cha: vEsarakumI jIvuDA vedakivedaki daivamunu
    AsapATugA hari yunnADide amduku brahlAduDE sAkshi
    mOsapOkumI janmamA mumchina yanumAnamulanu
    sEsinabhaktiki jETu lEdu yIsEtakella dhruvuDE sAkshi

    cha: tamakimchakumI dEhamA tagusukhadu@hkhambula nalasi
    amitamu naraharikaruNa nammitE namduku narjunuDE sAkshi
    bhramayakumI vivEkamA bahukAlambulu yIdIdi
    tamitO dAsyamu tanu rakshimchunu dAniki balImdruDE sAkshi

    cha: marigivumDumI vOjihvA mari SrIvEmkaTapatinutulu
    arayaga nidiyE yIDErimchunu amduku vyAsAdulE sAkshi
    tirugakumI vij~nAnamA drishTapumAyalakunu lOgi
    sarilE ditanipAdasEvakunu sanakAdulabradukE sAkshi



    Artist(s): P Ranganath



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported