Banner


    ఆతనిమూలమే జగమంతా నిది
    సంపుటి: 2, సంఖ్య: 362, పుట: 243 (315)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆతనిమూలమే జగమంతా నిది
    ఆతుమలో హరి కీలు ‌అయివుండుఁ గాని

    చ: మచ్చరము లేకున్నను మనసే రామరాజ్యము
    వచ్చినట్టె వచ్చితేను వలపే చవి
    యెచ్చుకుందు లేకున్న నెక్కడైనా సుఖమే
    యిచ్చకుఁడై హరి తన కియ్యవలెఁ గాని

    చ: నెట్టుకొని నడచితే నిజమే మూలధనము
    పట్టినదే వ్రతమైతే భవమే మేలు
    జట్టిగా నొనగూడితే సంసారమే ఫలము
    యిట్టి హరి దనకు నియ్యవలెఁ గాని

    చ: చెప్పినట్లు సేసితేను చేరి దేహమే చుట్టము
    తప్పులు లేనిదియైతే ధర్మమే సొమ్ము
    చొప్పున హరిదాసులు సోదించి చూచిన దిది
    యెప్పుడు శ్రీవేంకటేశుఁ డియ్యవలెఁ గాని


    AtanimUlamE jagamamtA nidi
    sampuTi: 2, samkhya: 362, puTa: 243 (315)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa: AtanimUlamE jagamamtA nidi
    AtumalO hari kIlu ‌ayivumDu gAni

    cha: machcharamu lEkunnanu manasE rAmarAjyamu
    vachchinaTTe vachchitEnu valapE chavi
    yechchukumdu lEkunna nekkaDainA sukhamE
    yichchakuDai hari tana kiyyavale gAni

    cha: neTTukoni naDachitE nijamE mUladhanamu
    paTTinadE vratamaitE bhavamE mElu
    jaTTigA nonagUDitE samsAramE phalamu
    yiTTi hari danaku niyyavale gAni

    cha: cheppinaTlu sEsitEnu chEri dEhamE chuTTamu
    tappulu lEnidiyaitE dharmamE sommu
    choppuna haridAsulu sOdimchi chUchina didi
    yeppuDu SrIvEmkaTESu Diyyavale gAni



    Artist(s): Shobha Raju



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported