Banner


    ఆతనిఁ గూడినప్పుడే అన్నియు
    సంపుటి: 19, సంఖ్య: 468, పుట: 313 (333)
    సంపుటిలో రాగం: రామక్రియ
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆతనిఁ గూడినప్పుడే అన్నియు సాదించవమ్మా
    రాతిరాయ నిఁకనైనా రమ్మనవమ్మా

    చ: అంపినమాట కుత్తర మానతియ్యవమ్మా
    వంపుమోముతో నలుక వలదమ్మా
    పంపుడుచెలుల మింతే పలుక విదేమమ్మ
    చెంప జారినతురుము చెరుగుకోవమ్మా

    చ: తమకించే పతితో నీతలఁపు లేమందుమమ్మ
    కొమరుఁ జూపులలోన కోపమేలమ్మా
    జమళి నిద్దరి కూడిగములవారమమ్మ
    చెమరించే మేనెల్లాఁ జిన్నఁ బోకువమ్మా

    చ: యెదురుగా వచ్చు నాతఁ డిట్టె మమ్మంపవమ్మ
    కదిసితి విఁత నీకుఁ గడుమేలమ్మా
    యెదుట శ్రీవేంకటేశుఁ డేఁగివచ్చి నిన్నుఁ గూడె
    వదలఁడు దిన మిట్టె వచ్చీ నోయమ్మా


    Atani gUDinappuDE anniyu
    sampuTi: 19, samkhya: 468, puTa: 313 (333)
    sampuTilO rAgam: rAmakriya
    rachana: tALlapAka annamAchArya


    pa: Atani gUDinappuDE anniyu sAdimchavammA
    rAtirAya nikanainA rammanavammA

    cha: ampinamATa kuttara mAnatiyyavammA
    vampumOmutO naluka valadammA
    pampuDuchelula mimtE paluka vidEmamma
    chempa jArinaturumu cherugukOvammA

    cha: tamakimchE patitO nItalapu lEmamdumamma
    komaru jUpulalOna kOpamElammA
    jamaLi niddari kUDigamulavAramamma
    chemarimchE mEnellA jinna bOkuvammA

    cha: yedurugA vachchu nAta DiTTe mammampavamma
    kadisiti vita nIku gaDumElammA
    yeduTa SrIvEmkaTESu DEgivachchi ninnu gUDe
    vadalaDu dina miTTe vachchI nOyammA



    Artist(s): T P Chakrapani



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported