Banner


    అతనిఁ బాడెదను అది వ్రతము
    సంపుటి: 15, సంఖ్య: 404, పుట: 272 (327)
    సంపుటిలో రాగం: దేసాళం
    రచన: తాళ్లపాక పెదతిరుమలాచార్య


    ప: అతనిఁ బాడెదను అది వ్రతము
    చతురుని శేషాచలనివాసుని

    చ: నకాదులు యే సర్వేశుఁ గొలిచిరి
    అనిశము శుకుఁ డెవ్వనిఁ దలఁచె
    మును ధ్రువుఁ డేదేవుని సన్నుతించె
    ఘననారదుఁ డేఘనునిఁ బొగడెను

    చ: యెలమి విభీషణుఁ డేదేవు శరణనె
    తలఁచె భీష్ము డేదైవమును
    బలు ప్రహ్లాదుని ప్రాణేశుఁ డెవ్వఁడు
    యిలలో వసిష్టుఁ డేమూర్తిఁ దెలిసె

    చ: పురిగొని వ్యాఁసుడేపురుషునిఁ జెప్పెను
    తిరముగ నర్జుని దిక్కెవ్వఁడు
    మరిగిని యలమేల్మంగపతి యెవ్వఁడు
    గరిమల శ్రీవేంకటేశుఁ డీతఁడు


    atani bADedanu adi vratamu
    sampuTi: 15, samkhya: 404, puTa: 272 (327)
    sampuTilO rAgam: dEsALam
    rachana: tALlapAka pedatirumalAchArya


    pa: atani bADedanu adi vratamu
    chaturuni SEshAchalanivAsuni

    cha: nakAdulu yE sarvESu golichiri
    aniSamu Suku Devvani dalache
    munu dhruvu DEdEvuni sannutimche
    ghananAradu DEghanuni bogaDenu

    cha: yelami vibhIshaNu DEdEvu SaraNane
    talache bhIshmu DEdaivamunu
    balu prahlAduni prANESu DevvaDu
    yilalO vasishTu DEmUrti delise

    cha: purigoni vyAsuDEpurushuni jeppenu
    tiramuga narjuni dikkevvaDu
    marigini yalamElmamgapati yevvaDu
    garimala SrIvEmkaTESu DItaDu



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported