Banner


    అతని నమ్మలే రల్పమతులు
    సంపుటి: 3, సంఖ్య: 533, పుట: 353 (398)
    సంపుటిలో రాగం: వసంతవరాళి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అతని నమ్మలే రల్పమతులు భువి
    నతఁ డాద్యుఁడు పరమాత్ముఁడు

    చ: సకలలోకపతి సర్వేశ్వరుఁడట
    వొకఁడిఁక దొర మరి వున్నాఁడా
    ప్రకటించఁగ శ్రీపతియే దాతట
    వెకలి నియ్యఁగొన వేరే కలరా

    చ: దివిజవందితుఁడు దిక్కుల హరియట
    యివల మొక్క సురలిఁక వేరీ
    కవ నంతర్యామి కరుణాకరుఁడట
    వివిధభంగులను వెదకఁగనేలా

    చ: వేదాంగుఁడు శ్రీవేంకటపతి యట
    ఆదిమతము లిఁక నరసేదా
    యేదెస నెవ్వరి కెప్పుడుఁ గలఁ డితఁ-
    డీదేవుఁడె మన కిహపర మొసఁగ


    atani nammalE ralpamatulu
    sampuTi: 3, samkhya: 533, puTa: 353 (398)
    sampuTilO rAgam: vasamtavarALi
    rachana: tALlapAka annamAchArya


    pa: atani nammalE ralpamatulu bhuvi
    nata DAdyuDu paramAtmuDu

    cha: sakalalOkapati sarvESvaruDaTa
    vokaDika dora mari vunnADA
    prakaTimchaga SrIpatiyE dAtaTa
    vekali niyyagona vErE kalarA

    cha: divijavamdituDu dikkula hariyaTa
    yivala mokka suralika vErI
    kava namtaryAmi karuNAkaruDaTa
    vividhabhamgulanu vedakaganElA

    cha: vEdAmguDu SrIvEmkaTapati yaTa
    Adimatamu lika narasEdA
    yEdesa nevvari keppuDu gala Dita-
    DIdEvuDe mana kihapara mosaga



    Artist(s): Priya Sisters



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported