Banner


    ఆతఁడు నీవాడినట్టె అన్నిపనులనుఁ
    సంపుటి: 27, సంఖ్య: 438, పుట: 296 (338)
    సంపుటిలో రాగం: సాళంగనాట
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆతఁడు నీవాడినట్టె అన్నిపనులనుఁ జేసు
    శ్రీతరుణిని మమ్ము రక్షించవమ్మ

    చ: యేలవమ్మ మమ్మును యెక్కింతివి పతి వురము
    నీలీల లేమి సేసినా నీకుఁజెల్లును
    బాలకి వన్నిటా నీవు పనిగొంటి వాతనిని
    కీలు నీచే నున్నది రక్షించవమ్మా

    చ: మన్నించవమ్మ మమ్ము మగఁడు నీచేతివాఁడు
    సన్నల నీచేఁతలెల్లా సాగి వచ్చీని
    అన్నిటాఁ జక్కనిదాన వటమీఁదట దొరవు
    యెన్నికె కెక్కె నీబ్రదు కిఁకఁ గావవమ్మా

    చ: యీడేరించవమ్మ మమ్ము నిట్టె యలమేల్మంగవు
    గూడితి శ్రీ వేంకటేశుఁ గోరినట్టెల్లా
    యీడులేనిదానవు నే మూడిగాలవార మిదె
    వేడుక లెల్లా నీసొమ్మే వెలయించవమ్మా


    AtaDu nIvADinaTTe annipanulanu
    sampuTi: 27, samkhya: 438, puTa: 296 (338)
    sampuTilO rAgam: sALamganATa
    rachana: tALlapAka annamAchArya


    pa: AtaDu nIvADinaTTe annipanulanu jEsu
    SrItaruNini mammu rakshimchavamma

    cha: yElavamma mammunu yekkimtivi pati vuramu
    nIlIla lEmi sEsinA nIkujellunu
    bAlaki vanniTA nIvu panigomTi vAtanini
    kIlu nIchE nunnadi rakshimchavammA

    cha: mannimchavamma mammu magaDu nIchEtivADu
    sannala nIchEtalellA sAgi vachchIni
    anniTA jakkanidAna vaTamIdaTa doravu
    yennike kekke nIbradu kika gAvavammA

    cha: yIDErimchavamma mammu niTTe yalamElmamgavu
    gUDiti SrI vEmkaTESu gOrinaTTellA
    yIDulEnidAnavu nE mUDigAlavAra mide
    vEDuka lellA nIsommE velayimchavammA



    Artist(s): N/A



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported