Banner


    ఆతఁ డెవ్వాఁడు చూపరే
    సంపుటి: 21, సంఖ్య: 385, పుట: 257 (289)
    సంపుటిలో రాగం: ధన్నాసి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆతఁ డెవ్వాఁడు చూపరే అమ్మలాల
    ఏతుల నాడేటి క్రిష్ణుఁ డీతఁడే కాఁడుగదా

    చ: కందువ దేవకి బిడ్డఁగనెనట నడురేయి
    అంది యశోదకుఁ గొడుకైనాఁడట
    సందడించి పూతకిచంటిపాలుఁ దాగెనట
    మందల ఆవులఁ గాచి మలసెనట

    చ: మంచిబండి దన్నెనట మద్దులు విరిచెనట
    ఇంచుకంతవేలఁ గొండయెత్తినాఁడట
    మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట
    మించులఁ బిల్లగోవివట్టి మెరసెనట

    చ: కాళింగుని మెట్టెనట కంసుఁ బొరిగొనెనట
    పాలించి సురలఁ జేపట్టెనట
    యీలీల శ్రీవేంకటాద్రి నిరవైనదేవుఁడట
    యేలెనట పదారువేలింతుల నిందరిని


    Ata DevvADu chUparE
    sampuTi: 21, samkhya: 385, puTa: 257 (289)
    sampuTilO rAgam: dhannAsi
    rachana: tALlapAka annamAchArya


    pa: Ata DevvADu chUparE ammalAla
    Etula nADETi krishNu DItaDE kADugadA

    cha: kamduva dEvaki biDDaganenaTa naDurEyi
    amdi yaSOdaku goDukainADaTa
    samdaDimchi pUtakichamTipAlu dAgenaTa
    mamdala Avula gAchi malasenaTa

    cha: mamchibamDi dannenaTa maddulu virichenaTa
    imchukamtavEla gomDayettinADaTa
    mamchAlapai golletalamAnAlu chEkonenaTa
    mimchula billagOvivaTTi merasenaTa

    cha: kALimguni meTTenaTa kamsu borigonenaTa
    pAlimchi surala jEpaTTenaTa
    yIlIla SrIvEmkaTAdri niravainadEvuDaTa
    yElenaTa padAruvElimtula nimdarini



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported