Banner


    అతఁడే పరబ్రహ్మ మతఁడే
    సంపుటి: 3, సంఖ్య: 470, పుట: 316 (356)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అతఁడే పరబ్రహ్మ మతఁడే లోకనాయకుఁ-
    డతనికంటే మరి యధికులు వేరయ్యా

    చ: కమలవాసిని లక్ష్మి కలదా యెవ్వరి కైనాఁ
    గమలనాభునికి నొక్కని కే కాక
    కమలజుఁడైన బ్రహ్మ కలఁడా యెవ్వని నాభి-
    నమరవంద్యుఁడు మా హరికే కాక

    చ: అందరు నుండెడి భూమి యన్యులకుఁ గలదా
    అందపు గోవిందునికే ఆలాయఁగాక
    చెందిన భాగీరథి శ్రీపాదాలఁ గలదా
    మందరధరుఁడయిన మాధవునికిఁ గాక

    చ: నిచ్చలు నభయమిచ్చేనేరుపు యెందుఁ గలదా
    అచ్చుగ నారాయణునియందే కాక
    రచ్చల శరణాగత రక్షణ మెందుఁ గలదా
    తచ్చిన శ్రీవేంకటాద్రిదైవానకే కాక


    ataDE parabrahma mataDE
    sampuTi: 3, samkhya: 470, puTa: 316 (356)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa: ataDE parabrahma mataDE lOkanAyaku-
    DatanikamTE mari yadhikulu vErayyA

    cha: kamalavAsini lakshmi kaladA yevvari kainA
    gamalanAbhuniki nokkani kE kAka
    kamalajuDaina brahma kalaDA yevvani nAbhi-
    namaravamdyuDu mA harikE kAka

    cha: amdaru numDeDi bhUmi yanyulaku galadA
    amdapu gOvimdunikE AlAyagAka
    chemdina bhAgIrathi SrIpAdAla galadA
    mamdaradharuDayina mAdhavuniki gAka

    cha: nichchalu nabhayamichchEnErupu yemdu galadA
    achchuga nArAyaNuniyamdE kAka
    rachchala SaraNAgata rakshaNa memdu galadA
    tachchina SrIvEmkaTAdridaivAnakE kAka



    Artist(s): N/A



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported