Banner


    ఆతఁడే బ్రహ్మణ్యదైవ
    సంపుటి: 3, సంఖ్య: 358, పుట: 241 (281)
    సంపుటిలో రాగం: దేసాళం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు
    ఆతని మానుటలెల్లా నవిధిపూర్వకము

    చ: యెవ్వని పేరఁ బిలుతు రిలఁ బుట్టినజీవుల
    నవ్వుచు మాసనక్షత్రనామములను
    అవ్వల నెవ్వని కేశవాదినామములే
    రవ్వగా నాచమనాలు రచియింతురు

    చ: అచ్చ మేదేవుని నారాయణనామమే గతి
    చచ్చేటివారికి సన్యాసమువారికి
    ఇచ్చ నెవ్వరిఁ దలఁచి యిత్తురు పితాళ్లకు
    ముచ్చట నెవ్వనినామములనే సంకల్పము

    చ: నారదుఁడుదలఁచేటినామ మది యెవ్వనిది
    గౌరినుడిగేటినామకథ యేడది
    తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరినామము
    యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వఁడిచ్చీ వరము


    AtaDE brahmaNyadaiva
    sampuTi: 3, samkhya: 358, puTa: 241 (281)
    sampuTilO rAgam: dEsALam
    rachana: tALlapAka annamAchArya


    pa: AtaDE brahmaNyadaiva mAdimUlamainavADu
    Atani mAnuTalellA navidhipUrvakamu

    cha: yevvani pEra bilutu rila buTTinajIvula
    navvuchu mAsanakshatranAmamulanu
    avvala nevvani kESavAdinAmamulE
    ravvagA nAchamanAlu rachiyimturu

    cha: achcha mEdEvuni nArAyaNanAmamE gati
    chachchETivAriki sanyAsamuvAriki
    ichcha nevvari dalachi yitturu pitALlaku
    muchchaTa nevvaninAmamulanE samkalpamu

    cha: nAraduDudalachETinAma madi yevvanidi
    gaurinuDigETinAmakatha yEDadi
    tArakamai brahmarudratati kevvarinAmamu
    yIrIti SrIvEmkaTAdri nevvaDichchI varamu



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported