Banner


    అదె చూడరే మోహనరూపం
    సంపుటి: 24, సంఖ్య: 208, పుట: 139 (166)
    సంపుటిలో రాగం: హిందోళవసంతం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అదె చూడరే మోహనరూపం
    పదిగోట్లుగలభావజరూపం

    చ: వెలయఁగఁ బదారువేలుమగువలను
    అలమినఘనమోహనరూపం
    వలచిననందవ్రజముగొల్లెతల
    కులుకుఁజూపులకు గురియగురూపం

    చ: యిందిరావనిత నెప్పుడుఁ దనవుర-
    మందునిలిపినమోహనరూపం
    కందువభూసతికాఁగిటిసొంపుల-
    విందులు మరిగిన వేడుకరూపం

    చ: త్రిపురసతుల బోధించిరమించిన
    అపురూపపుమోహనరూపం
    కపురులశ్రీవేంకటపతియై యిల
    నుపమించఁగరానివున్నతరూపం


    ade chUDarE mOhanarUpam
    sampuTi: 24, samkhya: 208, puTa: 139 (166)
    sampuTilO rAgam: himdOLavasamtam
    rachana: tALlapAka annamAchArya


    pa: ade chUDarE mOhanarUpam
    padigOTlugalabhAvajarUpam

    cha: velayaga badAruvElumaguvalanu
    alaminaghanamOhanarUpam
    valachinanamdavrajamugolletala
    kulukujUpulaku guriyagurUpam

    cha: yimdirAvanita neppuDu danavura-
    mamdunilipinamOhanarUpam
    kamduvabhUsatikAgiTisompula-
    vimdulu marigina vEDukarUpam

    cha: tripurasatula bOdhimchiramimchina
    apurUpapumOhanarUpam
    kapurulaSrIvEmkaTapatiyai yila
    nupamimchagarAnivunnatarUpam



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported