Banner


    ఆతడే సకలము అనిభావింపుచూ
    సంపుటి: 3, సంఖ్య: 25, పుట: 17 (57)
    సంపుటిలో రాగం: శంకరాభరణం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆతఁడే సకలము అని భావింపుచు
    నీతితో నడవక నిలుకడ యేది

    చ: యెందునుఁ జూచిన యీశ్వరుఁ డుండఁగ
    విందుల మనసుకు వెలితేది
    సందడించేహరిచైతన్య మిదివో
    కందువలిఁక వెదకఁగ నేది

    చ: అంతరాత్ముఁడై హరి పొడచూపఁగ
    పంతపుకర్మపుభయ మేది
    సంతత మాతఁడే స్వతంత్రుఁ డిదివో
    కొంత గొంత మరి కోరెడి దేది

    చ: శ్రీవేంకటపతి జీవుని నేలఁగ
    యీవల సందేహ మిఁక నేది
    భావం బీతఁడు ప్రపంచ మీతఁడు
    వేవేలుగ మరి వెదకెడి దేది


    AtaDE sakalamu aniBAviMpucU
    sampuTi: 3, samkhya: 25, puTa: 17 (57)
    sampuTilO rAgam: SamkarAbharaNam
    rachana: tALlapAka annamAchArya


    pa: AtaDE sakalamu ani bhAvimpuchu
    nItitO naDavaka nilukaDa yEdi

    cha: yemdunu jUchina yISvaru DumDaga
    vimdula manasuku velitEdi
    samdaDimchEharichaitanya midivO
    kamduvalika vedakaga nEdi

    cha: amtarAtmuDai hari poDachUpaga
    pamtapukarmapubhaya mEdi
    samtata mAtaDE svatamtru DidivO
    komta gomta mari kOreDi dEdi

    cha: SrIvEmkaTapati jIvuni nElaga
    yIvala samdEha mika nEdi
    bhAvam bItaDu prapamcha mItaDu
    vEvEluga mari vedakeDi dEdi



    Artist(s): V Ananda Bhattar , Anuradha Sriram



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported