Banner


    అతడే రక్షకు డందరికతడే
    సంపుటి: 4, సంఖ్య: 380, పుట: 255 (267)
    సంపుటిలో రాగం: దేశాక్షి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అతఁడే రక్షకుఁ డందరి కతఁడే
    పతి యుండఁగ భయపడఁ జోటేది

    చ: అనంతకరము లనంతాయుధము-
    లనంతుడు ధరించెలరఁగను
    కనుఁగొని శరణాగతులకు మనకును
    పనివడి యిఁక భయపడఁజోటేది

    చ: ధరణి నభయహస్తముతో నెప్పుడు
    హరి రక్షకుఁడై యలరఁగను
    నరహరికరుణే నమ్మినవారికి
    పరఁదున నిఁక భయపడఁజోటేది

    చ: శ్రీ వేంకటమున జీవులఁ గాచుచు
    నావల నీవల నలరఁగను
    దైవశిఖామణి దాపగు మాకును
    భావింపఁగ భయపడఁజోటేది


    ataDE rakShaku DaMdarikataDE
    sampuTi: 4, samkhya: 380, puTa: 255 (267)
    sampuTilO rAgam: dESAkshi
    rachana: tALlapAka annamAchArya


    pa: ataDE rakshaku Damdari kataDE
    pati yumDaga bhayapaDa jOTEdi

    cha: anamtakaramu lanamtAyudhamu-
    lanamtuDu dharimchelaraganu
    kanugoni SaraNAgatulaku manakunu
    panivaDi yika bhayapaDajOTEdi

    cha: dharaNi nabhayahastamutO neppuDu
    hari rakshakuDai yalaraganu
    naraharikaruNE namminavAriki
    paraduna nika bhayapaDajOTEdi

    cha: SrI vEmkaTamuna jIvula gAchuchu
    nAvala nIvala nalaraganu
    daivaSikhAmaNi dApagu mAkunu
    bhAvimpaga bhayapaDajOTEdi



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported