Banner


    ఆసమీఁద విసువౌ దాఁక
    సంపుటి: 1, సంఖ్య: 212, పుట: 141 (207)
    సంపుటిలో రాగం: ఆహిరి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆసమీఁద విసుపౌ(వౌ) దాఁక యీ-
    గాసిఁబరచుతనకపటమే సుఖము

    చ: తిరమగుఁగర్మము దెగుదాఁక తన-
    గరిమసుఖము పొగడునందాఁక
    పరమార్గం బగపడుదాఁక తన-
    పరితాపపులంపటమే సుఖము

    చ: కాయము గడపల గనుదాఁక యీ
    మాయ దన్ను వెడమరుదాఁక
    రాయడిమదము గరఁగుదాఁక యీ-
    రోయఁదగినతనరూపమే సుఖము

    చ: లంకెలఁ బొరలి నలఁగుదాఁక యీ
    యంకెలభవము లెరవౌదాఁక
    వేంకటపతిఁ దడవినదాఁక యీ
    కింకురువాణపు గెలుపే సుఖము


    AsamIda visuvau dAka
    sampuTi: 1, samkhya: 212, puTa: 141 (207)
    sampuTilO rAgam: Ahiri
    rachana: tALlapAka annamAchArya


    pa: AsamIda visupau(vau) dAka yI-
    gAsibarachutanakapaTamE sukhamu

    cha: tiramagugarmamu degudAka tana-
    garimasukhamu pogaDunamdAka
    paramArgam bagapaDudAka tana-
    paritApapulampaTamE sukhamu

    cha: kAyamu gaDapala ganudAka yI
    mAya dannu veDamarudAka
    rAyaDimadamu garagudAka yI-
    rOyadaginatanarUpamE sukhamu

    cha: lamkela borali nalagudAka yI
    yamkelabhavamu leravaudAka
    vEmkaTapati daDavinadAka yI
    kimkuruvANapu gelupE sukhamu



    Artist(s): P Ranganath



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported