Banner


    ఆశాబద్ధుఁడనై యలసి నిన్నుఁ
    సంపుటి: 1, సంఖ్య: 175, పుట: 118 (184)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆశాబద్ధుఁడనై యలసి నిన్నుఁ గడు-
    గాసిఁబెట్టినవాఁడఁ గాను

    చ: ఘనకర్మపరుఁడనై కర్మరూపునిఁ జేయ
    నిను దూరి భారము నీకుఁ గట్టినవాఁడఁ గాను
    పనిలేనిదుఃఖలంపటుఁడనై దుఃఖము
    గనుపించకుమని కడువేఁడినవాఁడఁ గాను

    చ: శ్రీవేంకటగిరిదేవేశ నా కిది
    గావలెననువాఁడఁ గాను
    కావలసినయవి గదిసిన నవి నాకుఁ
    గావనుమనుజుండఁ గాను


    ASAbaddhuDanai yalasi ninnu
    sampuTi: 1, samkhya: 175, puTa: 118 (184)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa: ASAbaddhuDanai yalasi ninnu gaDu-
    gAsibeTTinavADa gAnu

    cha: ghanakarmaparuDanai karmarUpuni jEya
    ninu dUri bhAramu nIku gaTTinavADa gAnu
    panilEnidu@hKalampaTuDanai du@hKamu
    ganupimchakumani kaDuvEDinavADa gAnu

    cha: SrIvEmkaTagiridEvESa nA kidi
    gAvalenanuvADa gAnu
    kAvalasinayavi gadisina navi nAku
    gAvanumanujumDa gAnu



    Artist(s): Shobha Raju



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported