Banner


    ఆరూపమునకే హరి నేను
    సంపుటి: 4, సంఖ్య: 457, పుట: 308 (320)
    సంపుటిలో రాగం: సామంతం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆ రూపమునకే హరి నేను మొక్కెదను
    చేరి విభీషణుని శరణాగతుఁడని చేకొని సరిఁ గాచితివి

    చ: ఫాలలోచనుఁడు బ్రహ్మయు నింద్రుఁడు
    సోలి నగ్నియును సూర్యచంద్రులును
    నీలో నుండఁగ నెరిఁ గనెఁ గిరీటి
    మూలభూతివగుమూర్తివి గాన

    చ: అనంతశిరసుల ననంతపదముల-
    ననంతనయనము లనంతకరముల
    ఘన నీరూపము గనుఁగొనెఁ గిరీటి
    అనంతమూరితి వన్నిటఁ గాన

    చ: జగము లిన్నియును సకల మున్నీంద్రులు -
    నగు శ్రీ వేంకటనాథుఁడ నిన్నే
    పొగడఁగఁ గిరీటి పొడగనె నీరూపు
    అగణితమహిముఁడ వన్నిటఁగాన


    ArUpamunakE hari nEnu
    sampuTi: 4, samkhya: 457, puTa: 308 (320)
    sampuTilO rAgam: sAmamtam
    rachana: tALlapAka annamAchArya


    pa: A rUpamunakE hari nEnu mokkedanu
    chEri vibhIshaNuni SaraNAgatuDani chEkoni sari gAchitivi

    cha: phAlalOchanuDu brahmayu nimdruDu
    sOli nagniyunu sUryachamdrulunu
    nIlO numDaga neri gane girITi
    mUlabhUtivagumUrtivi gAna

    cha: anamtaSirasula nanamtapadamula-
    nanamtanayanamu lanamtakaramula
    ghana nIrUpamu ganugone girITi
    anamtamUriti vanniTa gAna

    cha: jagamu linniyunu sakala munnImdrulu -
    nagu SrI vEmkaTanAthuDa ninnE
    pogaDaga girITi poDagane nIrUpu
    agaNitamahimuDa vanniTagAna



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported