Banner


    అరుదరు దీగతి యహోబలేశ్వర
    సంపుటి: 3, సంఖ్య: 236, పుట: 158 (198)
    సంపుటిలో రాగం: ఆహిరినాట
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అరుదరు దీగతి యహోబలేశ్వర
    పొరిఁబొరి దాసులు పొగడుట యెట్టు

    చ: యెదుటఁ జించితివి హిరణ్యకశిపుని
    అదె ప్రహ్లాదుఁడు బంటగుటెట్లు
    కదిసినరుద్రునిగర్వ మడఁచితివి
    గుదిగొనిదివిజులు కొలుచుట యెట్టు

    చ: ఘనసింహాకృతి గైకొనివుంటివి
    యెనయఁగఁ గరిఁ గాచినదెట్లు
    పనివడి కంబము పగుల వెడలితివి
    మనుజులు పూజించి మరుగుట యెట్లు

    చ: సరవితో వీరరసమున మించితివి
    అరయఁగ శృంగారి వౌటెట్టు
    సిరివుర మెక్కెను శ్రీవేంకటాద్రిని
    యిరవుగ నీతొడ యెక్కుట యెట్టు


    arudaru dIgati yahObalESvara
    sampuTi: 3, samkhya: 236, puTa: 158 (198)
    sampuTilO rAgam: AhirinATa
    rachana: tALlapAka annamAchArya


    pa: arudaru dIgati yahObalESvara
    poribori dAsulu pogaDuTa yeTTu

    cha: yeduTa jimchitivi hiraNyakaSipuni
    ade prahlAduDu bamTaguTeTlu
    kadisinarudrunigarva maDachitivi
    gudigonidivijulu koluchuTa yeTTu

    cha: ghanasim^hAkRti gaikonivumTivi
    yenayaga gari gAchinadeTlu
    panivaDi kambamu pagula veDalitivi
    manujulu pUjimchi maruguTa yeTlu

    cha: saravitO vIrarasamuna mimchitivi
    arayaga SRmgAri vauTeTTu
    sirivura mekkenu SrIvEmkaTAdrini
    yiravuga nItoDa yekkuTa yeTTu



    Artist(s): G V N Anil



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported