Banner


    అరయ శ్రావణ బహుళాష్టమి
    సంపుటి: 13, సంఖ్య: 333, పుట: 221 (200)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన
    సిరులతో నుదయించె శ్రీకృష్ణుఁ డిదివో

    చ: వసుదేవునిపాలిటి వరతపోధనము
    యెసగి దేవకీదేవి యెదపై సొమ్ము
    సుసరాన గొల్లెతల సొంపు మంగళసూత్రము
    శిసువై వుదయించె శ్రీకృష్ణుఁ డిదివో

    చ: నందగోపుఁడు గన్న నమ్మిన నిధానము
    పొందగు యశోదకు పూజదైవము
    మందల యావులకును మంచి వజ్రపంజరము
    చెంది యుదయించినాఁడు శ్రీకృష్ణుఁ డిదివో

    చ: సేవ సేసే దాసుల చేతిలోని మాణికము
    శ్రీవేంకటాద్రి నేచిన బ్రహ్మము
    వోవరి నలమేల్మంగ నురముపైఁ బెట్టుకొని
    చేవదేర నుదయించె శ్రీకృష్ణుఁడిదివో


    araya SrAvaNa bahuLAshTami
    sampuTi: 13, samkhya: 333, puTa: 221 (200)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa: araya SrAvaNa bahuLAshTami chamdrOdayAna
    sirulatO nudayimche SrIkRshNu DidivO

    cha: vasudEvunipAliTi varatapOdhanamu
    yesagi dEvakIdEvi yedapai sommu
    susarAna golletala sompu mamgaLasUtramu
    Sisuvai vudayimche SrIkRshNu DidivO

    cha: namdagOpuDu ganna nammina nidhAnamu
    pomdagu yaSOdaku pUjadaivamu
    mamdala yAvulakunu mamchi vajrapamjaramu
    chemdi yudayimchinADu SrIkRshNu DidivO

    cha: sEva sEsE dAsula chEtilOni mANikamu
    SrIvEmkaTAdri nEchina brahmamu
    vOvari nalamElmamga nuramupai beTTukoni
    chEvadEra nudayimche SrIkRshNuDidivO



    Artist(s): G Balakrishna Prasad , S P Sailaja



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported