Banner


    అరసిమమ్ము గాచిన యాతనికి
    సంపుటి: 3, సంఖ్య: 374, పుట: 252 (292)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అరసి నన్నుఁ గాచినాతనికి శరణు
    పరము నిహమునేలే పతికిని శరణు

    చ: వేదములు దెచ్చినట్టి విభునికి శరణు
    ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు
    యేదెసాఁ దానై యున్నయీతనికి శరణు
    శ్రీదేవిమగఁడైన శ్రీపతికి శరణు

    చ: అందరికిఁ బ్రాణమైన ఆతనికి శరణు
    ముందు మూఁడుమూర్తులమూర్తికి శరణు
    దిందుపడి దేవతల దేవునికి శరణు
    అంది మిన్నునేల నేకమైనతనికి శరణు

    చ: తానే చైతన్యమైన దైవానకు శరణు
    నానాబ్రహ్మాండాలనాథునికి శరణు
    ఆనుక శ్రీవేంకటాద్రియందునుండి వరములు
    దీనుల కిందరి కిచ్చే దేవునికి శరణు


    arasimammu gAcina yAtaniki
    sampuTi: 3, samkhya: 374, puTa: 252 (292)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa: arasi nannu gAchinAtaniki SaraNu
    paramu nihamunElE patikini SaraNu

    cha: vEdamulu dechchinaTTi vibhuniki SaraNu
    AdimUlamamTE vachchinataniki SaraNu
    yEdesA dAnai yunnayItaniki SaraNu
    SrIdEvimagaDaina SrIpatiki SaraNu

    cha: amdariki brANamaina Ataniki SaraNu
    mumdu mUDumUrtulamUrtiki SaraNu
    dimdupaDi dEvatala dEvuniki SaraNu
    amdi minnunEla nEkamainataniki SaraNu

    cha: tAnE chaitanyamaina daivAnaku SaraNu
    nAnAbrahmAmDAlanAthuniki SaraNu
    Anuka SrIvEmkaTAdriyamdunumDi varamulu
    dInula kimdari kichchE dEvuniki SaraNu



    Artist(s): S Janaki



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported