Banner


    ఆరగించి కూర్చున్నాడల్లవాడే
    సంపుటి: 26, సంఖ్య: 181, పుట: 127 (183)
    సంపుటిలో రాగం: మాళవి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆరగించి కూచున్నాఁ డల్లవాఁడె
    చేరువనే చూడరే లక్ష్మీనారసింహుఁడు

    చ: ఇందిరనుఁ దొడమీఁద నిడుకొని కొలువిచ్చి
    అందపునవ్వులు చల్లీ నల్లవాఁడె
    చెందినమాణికముల శేషునిపడగెమీఁద
    చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుఁడు

    చ: బంగారుమేడలోన పచ్చలగద్దియలమీఁద
    అంగనలయాట చూచీ నల్లవాఁడె
    రంగగుసొమ్ములతోడ రాజసపువిభవాల
    చెంగట నున్నాడు లక్ష్మీనారసింహుఁడు

    చ: పెండెపుఁ బాదము చాఁచి పెనచి వోపాదము
    అండనే పూజలుగొనీ నల్లవాఁడె
    కొండల శ్రీవేంకటాద్రి గోరి యహోబలమున
    మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుఁడు


    AragiMci kUrcunnADallavADE
    sampuTi: 26, samkhya: 181, puTa: 127 (183)
    sampuTilO rAgam: mALavi
    rachana: tALlapAka annamAchArya


    pa: Aragimchi kUchunnA DallavADe
    chEruvanE chUDarE lakshmInArasiMhuDu

    cha: imdiranu doDamIda niDukoni koluvichchi
    amdapunavvulu challI nallavADe
    chemdinamANikamula SEshunipaDagemIda
    chemdi varAlichchI lakshmInArasiMhuDu

    cha: bamgArumEDalOna pachchalagaddiyalamIda
    amganalayATa chUchI nallavADe
    ramgagusommulatODa rAjasapuvibhavAla
    chemgaTa nunnADu lakshmInArasiMhuDu

    cha: pemDepu bAdamu chAchi penachi vOpAdamu
    amDanE pUjalugonI nallavADe
    komDala SrIvEmkaTAdri gOri yahObalamuna
    memDugAnu merasI lakshmInArasiMhuDu



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported