Banner


    అదె చూడరయ్యా పెద్దహనుమంతుని
    సంపుటి: 4, సంఖ్య: 509, పుట: 343 (355)
    సంపుటిలో రాగం: బౌళి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అదె చూడరయ్యా పెద్దహనుమంతుని
    గుదిగొని దేవతలు గొనియాడేరయ్యా

    చ: వుదయాస్తశైలములు వొకజంగగాఁ జాఁచె
    అదివో ధ్రువమండలమందె శిరసు
    చదివె సూర్యునివెంట సారె మొగము ద్రిప్పుచు
    యెదుట నీతనిమహిమ మేమని చెప్పేమయ్యా

    చ: దండిగా బ్రహ్మాండముదాఁక దోఁక మీఁదికెత్తె
    మెండగు దిక్కులు నిండ మేను వెంచెను
    గుండుగూడ రాకాసులఁ గొట్టఁగఁ జేతులు చాఁచె
    అండనీతని ప్రతాప మరుదరుదయ్యా

    చ: దిక్కులు పిక్కటిలఁగ దేహరోమములు వెంచె
    పక్కన లోకములకుఁ బ్రాణమై నిల్చె
    ఇక్కడ శ్రీవేంకటేశు హితవరిబంటాయ
    మిక్కిలి నీతనిలావు మేలు మేలయ్యా


    ade chUDarayyA peddahanumamtuni
    sampuTi: 4, samkhya: 509, puTa: 343 (355)
    sampuTilO rAgam: bauLi
    rachana: tALlapAka annamAchArya


    pa: ade chUDarayyA peddahanumamtuni
    gudigoni dEvatalu goniyADErayyA

    cha: vudayAstaSailamulu vokajamgagA jAche
    adivO dhruvamamDalamamde Sirasu
    chadive sUryunivemTa sAre mogamu drippuchu
    yeduTa nItanimahima mEmani cheppEmayyA

    cha: damDigA brahmAmDamudAka dOka mIdikette
    memDagu dikkulu nimDa mEnu vemchenu
    gumDugUDa rAkAsula goTTaga jEtulu chAche
    amDanItani pratApa marudarudayyA

    cha: dikkulu pikkaTilaga dEharOmamulu vemche
    pakkana lOkamulaku brANamai nilche
    ikkaDa SrIvEmkaTESu hitavaribamTAya
    mikkili nItanilAvu mElu mElayyA



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported