Banner


    అపు డేమనె నేమను మనెను
    సంపుటి: 6, సంఖ్య: 97, పుట: 71 (87)
    సంపుటిలో రాగం: ఆహిరి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అపు డేమనె నేమను మనెను
    తపమే విరహపుఁ దాపమనె

    చ: పవనజ యేమనె పడఁతి మఱేమనె
    అవనిజ నిను నేమను మనెను
    రవికులేంద్ర భారము ప్రాణంబనె
    ఇవల నెట్ల దరియించే ననె

    చ: యింకా నేమనె యింతి మఱేమనె
    కొంకక యేమని కొసరుమనె
    బొంకులదేహము పోదిది వేగనె
    చింకవేఁట యిటు చేసె ననె

    చ: నను నేమనె ప్రాణము మన కొకటనె
    తనకు నీవలెనె తాపమనె
    మనుకులేశ ప్రేమపుమనకూటమి
    ఘనవేంకటగిరిఁ గంటి ననె


    apu DEmane nEmanu manenu
    sampuTi: 6, samkhya: 97, puTa: 71 (87)
    sampuTilO rAgam: Ahiri
    rachana: tALlapAka annamAchArya


    pa: apu DEmane nEmanu manenu
    tapamE virahapu dApamane

    cha: pavanaja yEmane paDati ma~rEmane
    avanija ninu nEmanu manenu
    ravikulEmdra bhAramu prANambane
    ivala neTla dariyimchE nane

    cha: yimkA nEmane yimti ma~rEmane
    komkaka yEmani kosarumane
    bomkuladEhamu pOdidi vEgane
    chimkavETa yiTu chEse nane

    cha: nanu nEmane prANamu mana kokaTane
    tanaku nIvalene tApamane
    manukulESa prEmapumanakUTami
    ghanavEmkaTagiri gamTi nane



    Artist(s): P Ranganath, G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported