Banner


    కానకుంటి మిందాఁకా కంటి
    సంపుటి: 26, సంఖ్య: 105, పుట: 75 (131)
    సంపుటిలో రాగం: శ్రీరాగం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: కానకుంటి మిందాఁకా కంటి మాడకుఁ బోదము
    కానీలే అందుకేమి కళవళ మేలయ్యా

    చ: తొంగి చూచె నదె సీత తూరుపునఁ దమ్ముఁడా
    సంగతిఁ జందురుఁ డింతె సతి గాదయ్యా
    చెంగట నే వెదకఁగా జేరి నవ్వీఁ జూడరాదా
    రంగగు వెన్నెల లింతే రామచంద్ర చూడుమా

    చ: పొంచి చేతఁ బిలిచీని పొద దండ నదె సీత
    అంచెలఁ దీగె ఇంతే అటుగాదయ్యా
    యెంచనేల దవ్వులను యెలిఁగించీ వినరాదా
    పెంచవు నెమలి గాని పిలుపు గాదయ్యా

    చ: నిలుచుండి చూచె నదె నిండుఁగొలఁకులో సీత
    కలువ లింతే ఆపెగాదయ్యా
    కలికి శ్రీవేంకటాద్రిఁ గాఁగిలించె నిదె నన్ను
    తలఁపులో నాకె నిన్నుఁ దగిలుండునయ్యా


    kAnakumTi mimdAkA kamTi
    sampuTi: 26, samkhya: 105, puTa: 75 (131)
    sampuTilO rAgam: SrIrAgam
    rachana: tALlapAka annamAchArya


    pa: kAnakumTi mimdAkA kamTi mADaku bOdamu
    kAnIlE amdukEmi kaLavaLa mElayyA

    cha: tomgi chUche nade sIta tUrupuna dammuDA
    samgati jamduru Dimte sati gAdayyA
    chemgaTa nE vedakagA jEri navvI jUDarAdA
    ramgagu vennela limtE rAmachamdra chUDumA

    cha: pomchi chEta bilichIni poda damDa nade sIta
    amchela dIge imtE aTugAdayyA
    yemchanEla davvulanu yeligimchI vinarAdA
    pemchavu nemali gAni pilupu gAdayyA

    cha: niluchumDi chUche nade nimDugolakulO sIta
    kaluva limtE ApegAdayyA
    kaliki SrIvEmkaTAdri gAgilimche nide nannu
    talapulO nAke ninnu dagilumDunayyA



    Artist(s): S Venu Madhav



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported