Banner


    ఎక్కడి మాయామృగ మేల
    సంపుటి: 17, సంఖ్య: 322, పుట: 188 (210)
    సంపుటిలో రాగం: పాడి
    రచన: తాళ్లపాక పెద్ద తిరుమలాచార్య


    ప: ఎక్కడి మాయామృగ మేల తెమ్మంటి నేను
    అక్కడ నా వల్లనే యపరాధ మనుమీ

    చ: రాముఁడెన్నఁ డిందు వచ్చు రావణు నెన్నఁడు చంపు
    నీమాట హనుమంత నిజమా యిది
    యేమని నన్నుఁ దలఁచు యెట్ల నున్నాఁడు తాను
    ఆమాటే యింకొక్కపరి అడిగేఁ జెప్పుమా

    చ: యెటువలెఁ బొద్దు వేగు నినకులేశ్వరునకు
    నీటున నన్నుఁ బాసిననాటనుండి
    కటకట తన్నుఁ బాసి కంటి నే నిన్నియును
    యిటువలె దైవ మాయ యింత నన్నుఁ జేసెఁగా

    చ: వుంగరము పుతైంచెను వున్నదిగా కృప నాపై
    కంగిన పగెల్లా నీఁగి కైకొనె నన్ను
    కంగుగ శ్రీవేంకటాద్రి రఘుపతి నన్నుఁ గూడె
    యింగితాన నయాధ్య యేలెఁగా యిప్పుడు


    ekkaDi mAyAmRga mEla
    sampuTi: 17, samkhya: 322, puTa: 188 (210)
    sampuTilO rAgam: pADi
    rachana: tALlapAka pedda tirumalAchArya


    pa: ekkaDi mAyAmRga mEla temmamTi nEnu
    akkaDa nA vallanE yaparAdha manumI

    cha: rAmuDenna Dimdu vachchu rAvaNu nennaDu champu
    nImATa hanumamta nijamA yidi
    yEmani nannu dalachu yeTla nunnADu tAnu
    AmATE yimkokkapari aDigE jeppumA

    cha: yeTuvale boddu vEgu ninakulESvarunaku
    nITuna nannu bAsinanATanumDi
    kaTakaTa tannu bAsi kamTi nE ninniyunu
    yiTuvale daiva mAya yimta nannu jEsegA

    cha: vumgaramu putaimchenu vunnadigA kRpa nApai
    kamgina pagellA nIgi kaikone nannu
    kamguga SrIvEmkaTAdri raghupati nannu gUDe
    yimgitAna nayAdhya yElegA yippuDu



    Artist(s): S Venu Madhav



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported