Banner


    ముద్దు గారీఁ జూడరమ్మ
    సంపుటి: 11, సంఖ్య: 343, పుట: 197 (211)
    సంపుటిలో రాగం: పాడి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ముద్దు గారీఁ జూడరమ్మ మోహనమురారి వీఁడె
    మద్దులు విరిచిన మా మాధవుఁడు

    చ: చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
    వల్లెతాడు మా చిన్న వాసుదేవుఁడు
    మొల్లపుగోపికల మోవిపండులకు నెల్ల
    కొల్లకాఁడు గదమ్మ మా గోల గోవిందుఁడు

    చ: మందడిసానుల కమ్మని మోముఁదమ్ములకు
    చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుఁడు
    చంద మైన దొడ్డివారి సతులవయసులకు
    విందువంటివాఁ డమ్మ మా విఠ్ఠలుఁడు

    చ: హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
    పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
    మత్తిలి వ్రేతల నిండుమనసుల కెల్లాను
    చిత్తజునివంటివాఁడు శ్రీవేంకటేశుఁడు


    muddugArI jUDaramma
    sampuTi: 11, samkhya: 343, puTa: 197 (211)
    sampuTilO rAgam: pADi
    rachana: tALlapAka annamAchArya


    pa: muddu gArI jUDaramma mOhanamurAri vIDe
    maddulu virichina mA mAdhavuDu

    cha: challa lamma nErichinajANa golletala kella
    valletADu mA chinna vAsudEvuDu
    mollapugOpikala mOvipamDulaku nella
    kollakADu gadamma mA gOla gOvimduDu

    cha: mamdaDisAnula kammani mOmudammulaku
    chemdinatummidavO mA SrIkRShNuDu
    chamda maina doDDivAri satulavayasulaku
    vimduvamTivA Damma mA viThThaluDu

    cha: hattina rEpallelOni amganAmaNula kella
    pottula sUtramu mA buddhula hari
    mattili vrEtala nimDumanasula kellAnu
    chittajunivamTivADu SrIvEmkaTESuDu



    Artist(s): S Venu Madhav



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported