Banner


    ఆతఁ డితఁడా వెన్న లంతట
    సంపుటి: 4, సంఖ్య: 6, పుట: 4 (16)
    సంపుటిలో రాగం: లలిత
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆతఁ డితఁడా వెన్న లంతట దొంగిలినాఁడు
    యేతులకు మద్దులు రెండిలఁ దోసినాఁడు

    చ: యీతఁడా దేవకిగన్నయింద్రనీలమాణికము
    పూతకిచన్ను దాగి పొదలినాఁడు
    యీతఁడా వసుదేవునియింటిలో నిధానము
    చేతనే కంసునిఁ బుట్టచెండుసేసినాఁడు

    చ: మేటియైనగొంతిదేవిమేనల్లుఁ డీతఁడా
    కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను
    పాటించి పెంచేయశోదపాలి భాగ్య మీతఁడా
    వాటమై గొల్లెతలను వలపించినాఁడు

    చ: ముగురువేలుపులకు మూలభూతి యీతఁడా
    జిగి నావులఁ బేయలఁ జేరి కాచెను
    మిగుల శ్రీవేంకటాద్రిమీఁదిదైవ మితఁడా
    తగి రామకృష్ణావతార మందె నిప్పుడు


    Ata DitaDA venna lamtaTa
    sampuTi: 4, samkhya: 6, puTa: 4 (16)
    sampuTilO rAgam: lalita
    rachana: tALlapAka annamAchArya


    pa: Ata DitaDA venna lamtaTa domgilinADu
    yEtulaku maddulu remDila dOsinADu

    cha: yItaDA dEvakigannayimdranIlamANikamu
    pUtakichannu dAgi podalinADu
    yItaDA vasudEvuniyimTilO nidhAnamu
    chEtanE kamsuni buTTachemDusEsinADu

    cha: mETiyainagomtidEvimEnallu DItaDA
    kOTiki baDegegAnu komDa yettenu
    pATimchi pemchEyaSOdapAli bhAgya mItaDA
    vATamai golletalanu valapimchinADu

    cha: muguruvElupulaku mUlabhUti yItaDA
    jigi nAvula bEyala jEri kAchenu
    migula SrIvEmkaTAdrimIdidaiva mitaDA
    tagi rAmakRShNAvatAra mamde nippuDu



    Artist(s): S Venu Madhav



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported