Banner


    ఎన్నిబాధలఁ బెట్టి యేఁచెదవు
    సంపుటి: 1, సంఖ్య: 284, పుట: 190 (256)
    సంపుటిలో రాగం: శ్రీరాగం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఎన్నిబాధలఁ బెట్టి యేఁచెదవు నీ వింక
    నెంతకాలముదాఁకఁ గర్మమా
    మన్నించుమనుచు నీమఱఁగు చొచ్చితిమి
    మా మాటాలకించవో కర్మమా

    చ: ప్రతిలేనిదురితములపాలు సేయక
    నన్నుఁ బాలించవైతివో కర్మమా
    తతితోడ నాత్మపరితాపంబుతోడుతను
    తగులేల సేసితో కర్మమా
    జితకాములకుఁగాని చేతికిని లోనయి
    చిక్క వేకాలంబు కర్మమా
    మతిహీనులైనట్టి మాకు నొకపరిపాటి
    మార్గంబు చూపవో కర్మమా

    చ: ఆసలనియెడితాళ్ల నంటగట్టుక విధికి
    నప్పగించితివిగదె కర్మమా
    వాసి విడిచితిమి నీవారమైతిమి
    మమ్ము వన్నెచెడనీకు వోకర్మమా
    కాసుకునుఁగొరగానిగతిలేనిపనికిఁగా
    కాలూఁదనీవేల కర్మమా
    వోసరించొకమారు వొయ్యనే వొకరీతి
    నొల్లనని తలఁగుమీ కర్మమా

    చ: తిరువేంకటాచలాధిపునిమాయలచేత
    దెసలఁదిరిగినయట్టికర్మమా
    హరిదాసులగువారి నాదరింతువుగాక
    అంత నొప్పింతువా కర్మమా
    వరుస నేనుగమీఁదవాని సున్నం
    బడుగవచ్చునా నీకిట్లఁ గర్మమా
    పరమపురుషోత్తమునిభ్రమతఁబడి
    నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా


    ennibAdhala beTTi yEchedavu
    sampuTi: 1, samkhya: 284, puTa: 190 (256)
    sampuTilO rAgam: SrIrAgam
    rachana: tALlapAka annamAchArya


    pa: ennibAdhala beTTi yEchedavu nI vimka
    nemtakAlamudAka garmamA
    mannimchumanuchu nIma~ragu chocchitimi
    mA mATAlakimchavO karmamA

    cha: pratilEniduritamulapAlu sEyaka
    nannu bAlimchavaitivO karmamA
    tatitODa nAtmaparitApambutODutanu
    tagulEla sEsitO karmamA
    jitakAmulakugAni chEtikini lOnayi
    chikka vEkAlambu karmamA
    matihInulainaTTi mAku nokaparipATi
    mArgambu chUpavO karmamA

    cha: AsalaniyeDitALla namTagaTTuka vidhiki
    nappagimchitivigade karmamA
    vAsi viDichitimi nIvAramaitimi
    mammu vannecheDanIku vOkarmamA
    kAsukunugoragAnigatilEnipanikigA
    kAlUdanIvEla karmamA
    vOsarimchokamAru voyyanE vokarIti
    nollanani talagumI karmamA

    cha: tiruvEmkaTAchalAdhipunimAyalachEta
    desaladiriginayaTTikarmamA
    haridAsulaguvAri nAdarimtuvugAka
    amta noppimtuvA karmamA
    varusa nEnugamIdavAni sunnam
    baDugavacchunA nIkiTla garmamA
    paramapuruShOttamunibhramatabaDi
    nIviTla baTTabayalaitigA karmamA



    Artist(s): S Venu Madhav



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported