Banner


    నదులొల్లవు నాస్నానము
    సంపుటి: 1, సంఖ్య: 51, పుట: 34 (100)
    సంపుటిలో రాగం: ముఖారి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: నదులొల్లవు నాస్నానము కడు-
    సదరము నా కీస్నానము

    చ: ఇరువంకల నీయేచినముద్రలు
    ధరియించుటె నాస్నానము
    ధరపై నీనిజదాసులదాసుల-
    చరణధూళి నాస్నానము

    చ: తలఁపులోన నినుఁదలఁచినవారలఁ
    దలఁచుటే నాస్నానము
    వలనుగ నినుఁగనువారలశ్రీపాద-
    జలములే నాస్నానము

    చ: పరమభాగవతపాదాంబుజముల-
    దరుశనమే నాస్నానము
    తిరువేంకటగిరిదేవ నీకథా-
    స్మరణమే నాస్నానము


    nadulollavu nA snAnamu
    sampuTi: 1, samkhya: 51, puTa: 34 (100)
    sampuTilO rAgam: mukhAri
    rachana: tALlapAka annamAchArya


    pa: nadulollavu nAsnAnamu kaDu-
    sadaramu nA kIsnAnamu

    cha: iruvamkala nIyEchinamudralu
    dhariyimchuTe nAsnAnamu
    dharapai nInijadAsuladAsula-
    charaNadhULi nAsnAnamu

    cha: talapulOna ninudalachinavArala
    dalachuTE nAsnAnamu
    valanuga ninuganuvAralaSrIpAda-
    jalamulE nAsnAnamu

    cha: paramabhAgavatapAdAmbujamula-
    daruSanamE nAsnAnamu
    tiruvEmkaTagiridEva nIkathA-
    smaraNamE nAsnAnamu



    Artist(s): S Venu Madhav



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported